శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (11:30 IST)

అనుష్కను కాపీ కొట్టిన సన్నీలియోన్..

బాలీవుడ్ నాయిక సన్నీలియోన్ తొలిసారి దక్షిణాదిలో సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో వీరమాదేవిగా వస్తోంది. ఈ సినిమా చారిత్రాత్మక యుద్ధ నేపథ్యంలో రూపుదిద్దుకోంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుత

బాలీవుడ్ నాయిక సన్నీలియోన్ తొలిసారి దక్షిణాదిలో సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో వీరమాదేవిగా వస్తోంది. ఈ సినిమా చారిత్రాత్మక యుద్ధ నేపథ్యంలో రూపుదిద్దుకోంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వీసీ వడివుడయన్ తెరకెక్కిస్తుండగా, స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో ఫోటో విడుదల చేస్తూ మూవీపై చాలా ఆసక్తిని కలిగిస్తున్నారు. తాజాగా కత్తి, విల్లు పట్టుకుని ఆవేశంగా చూస్తున్న సన్నీలియోన్ పోస్టర్‌ను ఫస్ట్ లుక్‌గా విడుదల చేశారు. ఇందులో సన్నీలుక్ రుద్రమదేవి చిత్రంలో అనుష్కకి కాపీగా వుందని నెటిజన్లు తెలిపారు. 
 
కత్తి పట్టి వీరత్వం, రౌద్రం, పౌరుషంతో బాగానే ట్రై చేసిన.. సన్నీకి ఈ సినిమా వర్కౌట్ కాదేమోన్న అనుమానాలని నెటిజన్స్ వ్యక్తపరుస్తున్నారు. ఈ చిత్రంలో సన్నీ పవర్ ఫుల్ క్వీన్‌గా కనిపిస్తోంది. నవదీప్, నాజర్‌లు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.