శ్రీదేవి ఏలోకంలో వున్నా.. ప్రేమిస్తూనే వుంటా: రామ్ గోపాల్ వర్మ
''క్షణక్షణం'' చిత్రంలో శ్రీదేవి కంటతడి పెట్టిన ఫోటోను రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేశాడు. అతిలోకసుందరికి వీరాభిమాని అయిన రామ్ గోపాల్ వర్మ ఆమె మరణ వార్త విని షాక్ అయ్యాడు. వరుసగా ట్వీట్లు చేస్తూ.. సోషల్ మీ
''క్షణక్షణం'' చిత్రంలో శ్రీదేవి కంటతడి పెట్టిన ఫోటోను రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేశాడు. అతిలోకసుందరికి వీరాభిమాని అయిన రామ్ గోపాల్ వర్మ ఆమె మరణ వార్త విని షాక్ అయ్యాడు. వరుసగా ట్వీట్లు చేస్తూ.. సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఈ క్రమంలో క్షణక్షణం చిత్రంలో ఆమె ఏడుస్తున్న ఫోటోను పెట్టి .. శ్రీదేవి నువ్వెందుకు ఏడుస్తున్నావు.. నీవు చేసిన పనికి మేమే ఆ పని చేస్తున్నామని వర్మ ఆందోళన వ్యక్తం చేశారు.
తాను సినిమాల్లోకి రావడానికి ప్రధానకారణం ఆమెను అతి దగ్గర నుంచి చూడవచ్చుననే ఆశతోనేనని వర్మ ట్వీట్ చేశారు. 'క్షణక్షణం' సినిమా శ్రీదేవికి తన ప్రేమలేఖ వంటిదని తెలిపారు.
అంతేగాకుండా శ్రీదేవి మరణంపై వర్మ దేవుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భగవంతుడిని తాను ఎన్నడూ ద్వేషించనంతగా ఈ దినం ద్వేషిస్తున్నానని మండిపడ్డారు. కాంతి కంటే ప్రకాశమైనది నేడు మనకు దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీదేవి ఏలోకంలో వున్నా.. ఎప్పుడూ ప్రేమిస్తూనే వుంటానని వర్మ తెలిపారు. శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని... ఆమె భర్త బోనీ కపూర్ గురించి ఆలోచిస్తూ వర్మ ఆవేదన చెందారు. శ్రీదేవి నిజంగానే చనిపోయిందా? ఎవరైనా నన్ను నిద్రలేపి, ఇదొక పీడకల మాత్రమే అని చెప్పగలరా? అని చెప్పారు.