గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2018 (17:34 IST)

వృద్ధాశ్రమంలో శవాల దందా.. వృద్ధుల శవాలను శ్మశానాలకు తరలించకుండా.. ఎముకలతో?

వృద్ధాశ్రమంలో శవాల దందా తమిళనాడులో వేలూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తోడునీడా లేకుండా వయసు మీద పడిన తర్వాత వృద్ధాశ్రమంలో చేరిన వృద్ధులకు కూడా భద్రత లేదు. కాంచీపురంలోని పాలేశ్వరం గ్రామంలో విదేశీ స్వ

వృద్ధాశ్రమంలో శవాల దందా తమిళనాడులో వేలూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తోడునీడా లేకుండా వయసు మీద పడిన తర్వాత వృద్ధాశ్రమంలో చేరిన వృద్ధులకు కూడా భద్రత లేదు. పాలేశ్వరం గ్రామంలో విదేశీ స్వచ్ఛంధ సంస్థల నిధులతో సెయింట్ జోసెఫ్ కరుణైఇల్లమ్ అనే వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వృద్ధాశ్రమం లోపల శవాల మాఫియా నడుస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. 
 
చెన్నైలోని తాంబరం వృద్ధాశ్రమానికి చెందిన విజయకుమార్ (75) ప్రభుత్వాసుపత్రిలో మరణిస్తే.. అతని మృతదేహాన్ని తరలించేందుకు పాలేశ్వరం వృద్ధాశ్రమానికి చెందిన వ్యాన్ రావడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని తరలించిన వ్యాన్ నుంచి అరుపులు వినిపించడంతో స్థానికులు ఆ వ్యానును ఆపి.. ఆరా తీశారు. అప్పుడే నిజం వెలుగులోకి వచ్చింది. 
 
ఓ వృద్ధ దంపతులను తరలించడాన్ని కనుగొన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక అధికారులు ఆశ్రమంపై దాడులు జరపడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పాలేశ్వరం ఆశ్రమంలో వృద్ధుల ఎముకలతో పెద్ద దందా నడుస్తుందని వెల్లడి అయ్యింది. వృద్ధుల మృతదేహాలను శ్మశానాలకు తరలించకుండా దందా నడుపుతున్నారని తేలింది.