శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 4 మే 2018 (12:18 IST)

కొత్త పెళ్లి కొడుక్కి భార్య అశ్లీల ఫోటోలు.. పంపిందెవరు?

సోషల్ మీడియాతో లాభాలు కొంతైనా.. నష్టాలు మాత్రం ఎక్కువే. సోషల్ మీడియా వాడకంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్న వేళ.. ఓ పచ్చని కాపురంలో ఓ ప్రియుడు వాట్సాప్‌లో పోస్టు చేసిన ఫోటోలు చిచ్చు రేపాయి. వివరాల్లోక

సోషల్ మీడియాతో లాభాలు కొంతైనా.. నష్టాలు మాత్రం ఎక్కువే. సోషల్ మీడియా వాడకంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్న వేళ.. ఓ పచ్చని కాపురంలో ఓ ప్రియుడు వాట్సాప్‌లో పోస్టు చేసిన ఫోటోలు చిచ్చు రేపాయి. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని జయపురం సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి, బొరిగుమ్మకు చెందిన యువతికి ఏప్రిల్ 20న వివాహం జరిగింది. 
 
వీరిద్దరూ తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించకముందే భార్య మాజీ ప్రియుడు పంపిన ఫోటోలు కాపురంలో కలతలు రేపాయి. వాట్సాప్ ద్వారా ఓ యువకుడు వధువుకు చెందిన అశ్లీల ఫొటోలను పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలను చూసిన భర్త షాక్‌కు గురయ్యాడు. అశ్లీలంగా ఉన్న తన భార్య ఫొటోలను చూసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 
 
పోలీసులు జరిపిన దర్యాప్తులో... ఫొటోలు పంపించింది వధువు బాయ్‌ఫ్రెండ్ అని తెలియవచ్చింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ వరుడు భార్యతో కాపురం చేయలేనని తేల్చి చెప్పేశాడని సమాచారం.