శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 ఏప్రియల్ 2018 (15:18 IST)

సరిగ్గా నెల రోజుల క్రితం మ్యూజిక్ ప్రపంచాన్ని చూశాం : 'రంగస్థలం' రంగమ్మత్త (Photos)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సమంత జంటగా నటించి సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం గత నెలలో విడుదలై రికార్డులను కొల్లగొట్టింది. ఇందులో రంగమ్మత్త పాత్రను పోషించిన అనసూయకు మంచి మ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సమంత జంటగా నటించి సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం గత నెలలో విడుదలై రికార్డులను కొల్లగొట్టింది. ఇందులో రంగమ్మత్త పాత్రను పోషించిన అనసూయకు మంచి మార్కులే పడ్డాయి.
 
ఈ నేపథ్యంలో, అనసూయ సినిమా సక్సెస్‍‌ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఆమె ట్విట్టర్‌లో స్పందిస్తూ, గత నెల సరిగ్గా ఇదే రోజు 'రంగస్థలం'కు సంబంధించిన మ్యాజిక్ ప్రపంచాన్ని చూపించామని తెలిపింది. షూటింగ్ నాటి కొన్ని మధురమైన జ్ఞాపకాలను పంచుకుంటున్నానని చెప్పింది.
 
కాగా, ఈ చిత్రంలో అనసూయతో పాటు.. ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్‌, నరేష్‌ తదితరులు అద్భుతంగా నటించిన విషయం తెల్సిందే. పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన విషయం తెల్సిందే. కాగా, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.