మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 26 ఏప్రియల్ 2018 (12:24 IST)

ఆడిషన్‌లోనూ ఇరగదీసిన 'రంగమ్మత్త' (Video)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని కోడలు సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరక్కిన చిత్రం "రంగస్థలం". గత నెలలో విడుదలై బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. ఒక్క 'బాహుబలి' రికార్డు మినహా మిగిలిన అన్న

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని కోడలు సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరక్కిన చిత్రం "రంగస్థలం". గత నెలలో విడుదలై బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. ఒక్క 'బాహుబలి' రికార్డు మినహా మిగిలిన అన్ని రికార్డులను తిరగరాసింది.
 
ఈ చిత్రంలో హాట్ యాంకర్ అనసూయ రంగమ్మత్తగా నటించింది. ఈ పాత్రలో అనసూయ జీవించేసింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర హైలెట్. పల్లెటూరి మహిళగా అనసూయ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో ఆమెపై ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షంకురిపించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆడిషన్ నిర్వహించింది. ఇందులో కూడా అనసూయ ఇరగదీసింది. 
 
ఇక ఈ వీడియోలో పసులు రంగు చీర, ఎరుపు రంగు జాకెట్‌లో కనిపిస్తుండగా, చిట్టిబాబు, రంగమ్మత్త మధ్య జరిగిన ఓ సీన్ ఇది. చిట్టిబాబు కొత్త సిల్క్ బట్టలు ధరించి వస్తే, కొంపదీసి పెళ్లి కుదిరిందా? అని అడగటం, ఆపై ఇంతకీ పిల్లెలా ఉంది? ఈ పాటికి మీ మామయ్య ఉంటేనా తెగ సంతోషపడి పోయుండేవాడు... అయినా నేను లేనా ఏంటి? అన్న డైలాగులు ఉన్నాయి. ఈ సీన్ సినిమాలో లేనప్పటికీ, ఉంటే బాగుండుననిపించేలా ఉంది. ఆడిషన్‌లో భాగంగా సీన్ తీసినప్పటికీ, అందులోనూ అనసూయ ఇరగదీసిందని ఈ వీడియో చూసిన అభిమానులు అంటున్నారు. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.