శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 25 ఏప్రియల్ 2018 (12:06 IST)

ముఖ్యమంత్రి 'భరత్‌'పై చిట్టిబాబు ప్రశంసల వర్షం

ముఖ్యమంత్రి భరత్‌పై చిట్టిబాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఫెంటాస్టిక్, క్లాసికల్ మూవీ అంటూ వ్యాఖ్యానించారు. ప్రిన్స్ మహేష్ బాబు కైరా అద్వానీ కాంబినేషన్‌లో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "భరత్ అన

ముఖ్యమంత్రి భరత్‌పై చిట్టిబాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఫెంటాస్టిక్, క్లాసికల్ మూవీ అంటూ వ్యాఖ్యానించారు. ప్రిన్స్ మహేష్ బాబు కైరా అద్వానీ కాంబినేషన్‌లో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రం ఈనెల 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ప్రముఖ నిర్మాత డి.వి.వి దాన‌య్య నిర్మించిన ఈ చిత్రం విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. విడుదలైన అన్ని చోట్లా మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు భరత్‌‌ని మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
 
తాజాగా ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తూ మెగాపవర్‌ స్టార్ రామ్ చరణ్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. 'క్లాసిక్ ఫిల్మ్‌కి "భరత్ అనే నేను" చిత్రం చక్కని ఉదాహరణ. ప్రిన్స్ మహేష్ బాబు పవర్‌ఫుల్ నటనను ప్రదర్శించారు. చక్కని కథని అంతే చక్కగా కొరటాల శివగారు తెరకెక్కించారు. దేవి మ్యూజిక్ సూపర్. ఎంతో ఎంజాయ్ చేశాను పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్‌‌‌తో. అద్భుతమైన సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన కైరాకు అభినందనలు. మాకు ఇంత చక్కని చిత్రాన్ని ఇచ్చిన దానయ్యగారికి ధన్యవాదాలు. 'భరత్ అనే నేను' చిత్ర టీమ్‌కి నా అభినందనలు.." అంటూ చెర్రీ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. మిస్టర్ సి చేసిన ఈ పోస్ట్‌ని ఆయన భార్య ఉపాసన ట్విట్టర్ ప్రపంచానికి తెలియపరిచారు.