శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 19 ఏప్రియల్ 2018 (14:32 IST)

రామలక్ష్మి సమంతకు పోటీగా... చిట్టి రామలక్ష్మి (వీడియో)

''రంగస్థలం''లో రామలక్ష్మిగా సమంత నటించిన సంగతి తెలిసిందే. సమంత రామలక్ష్మి పాత్రను ఉతికి ఆరేసింది. పాత్రను సరిగ్గా సెటైపోయింది. ప్రస్తుతం రామలక్ష్మి పోటీగా మరో బుల్లి రామలక్ష్మి వచ్చేసింది. ఇదేంటి అనుక

''రంగస్థలం''లో రామలక్ష్మిగా సమంత నటించిన సంగతి తెలిసిందే. సమంత రామలక్ష్మి పాత్రను ఉతికి ఆరేసింది. పాత్రను సరిగ్గా సెటైపోయింది. ప్రస్తుతం రామలక్ష్మి పోటీగా మరో బుల్లి రామలక్ష్మి వచ్చేసింది. ఇదేంటి అనుకుంటున్నారా? అయితే చదవండి మరి. సమంత కంటే తానే బాగా చేయగలనని చిట్టి రామలక్ష్మి డ్యాన్స్ ఇరగదీస్తోంది. 
 
చక్కగా లంగాఓణీ వేసుకొని ముద్దుముద్దుగా వయ్యారంగా నడుము, చేతులు తిప్పుతూ రంగమ్మా మంగమ్మ పాటకు స్టెప్పులేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సమంత అభిమాని ఒకరు ట్వీట్ చేస్తూ.. ''రామలక్ష్మి పాత్ర మాకే కాదు కొన్ని వందల మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది'' అనడానికి ఇదొక ఉదాహరణ’ అంటూ ట్వీట్ పెట్టాడు. బుల్లి రామలక్ష్మి డ్యాన్స్ వీడియోను చూసిన సమంత , రంగమ్మత్త అనసూయ ఫిదా అయిపోయారు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన రంగస్థలం చిత్రం బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. దక్షిణాది అగ్ర సినీ నటీమణుల్లో ఒకరైన సమంత ప్రస్తుతం ''మహానటి'' సినిమాలో జర్నలిస్ట్‌ పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ తాను క్రీమ్‌ బన్‌ తింటూ డబ్బింగ్‌ చెబుతోన్న ఫొటోను పోస్ట్ చేసింది.

సగం తినేసి ఉన్న బన్నుని ఎడమ చేతితో పట్టుకుని, స్టూడియోలో కూర్చుని సమంత డబ్బింగ్‌ చెబుతున్నట్లు అందులో ఉంది. అంతేగాకుండా మహానటి డబ్బింగ్ కూడా పూర్తయ్యిందని శామ్ చెప్పింది. మహానటి సినిమా మే 9న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.