సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (11:36 IST)

నేచురల్ స్టార్ లెక్క త‌ప్పిందా..? కార‌ణం ఏమిటి..?

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన లేటెస్ట్ మూవీ "కృష్ణార్జున యుద్ధం". మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'కృష్ణార్జున యుద్ధం' ఇటీవ‌ల రిలీజైంది. ఈ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ఈ సినిమా ప్ర‌మ

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన లేటెస్ట్ మూవీ "కృష్ణార్జున యుద్ధం". మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'కృష్ణార్జున యుద్ధం' ఇటీవ‌ల రిలీజైంది. ఈ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో నాని కృష్ణార్జున ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంది. ఎందుకంటే... "రంగ‌స్థ‌లం" సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో చూశాం. ఫ్యామిలీ అంతా క‌లిసి 'రంగ‌స్థ‌లం' సినిమాని చూడ‌డానికి థియేట‌ర్స్‌కి వ‌స్తున్నారు. మ‌ళ్లీ జ‌నం థియేట‌ర్స్‌కు రావడం మొదలైంది.
 
అందుచేత 'కృష్ణార్జున యుద్ధం' చిత్రాన్నికూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. ఫ్యామిలీ అంతా క‌లిసి చూసేలా ఉన్న మా సినిమా విజ‌యం ఖాయం అని చెప్పాడు. కానీ... నాని లెక్క త‌ప్పింది. 'కృష్ణార్జున యుద్ధం' క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కుల‌ను ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. ప్రేక్ష‌కులు 'రంగ‌స్థ‌లం' చిత్రాన్ని మ‌రోసారి చూడ‌టానికి ఇష్ట‌ప‌డుతున్నారు కానీ.. 'కృష్ణార్జున యుద్ధం' థియేట‌ర్ వైపుకు వెళ్ల‌డం లేదు. 
 
నాని కెరీర్‌లో ఇప్ప‌టివర‌కు అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమా అంటే 'ఎం.సి.ఏ'. ఈ సినిమాకి ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వ‌చ్చాయి. ఈ సినిమాతో పొలిస్తే... 'కృష్ణార్జున యుద్ధం' చిత్రానికి ఓపెనింగ్స్ చాలా వీక్. ఈనెల 20న మ‌హేష్ "భ‌ర‌త్ అనే నేను" అంటూ వ‌చ్చేస్తున్నాడు. సో.. కృష్ణార్జున యుద్ధం విష‌యంలో నాని లెక్క త‌ప్పిన‌ట్టే..!