బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: గురువారం, 12 ఏప్రియల్ 2018 (22:13 IST)

నానిని తొక్కేసిన అనుపమ పరమేశ్వరన్.. ఎలా?

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కు అభిమానులు ఎక్కువే. క్యూట్ లుక్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు అనుపమ. నటించింది తక్కువ సినిమాలే అయినా పేరు మాత్రం బాగానే సంపాదించేసుకున్నారు. యువ హీరోలందరూ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ కావాలన్న స్థాయికి ఎదిగిపోయారు. ఇలాం

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కు అభిమానులు ఎక్కువే. క్యూట్ లుక్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు అనుపమ. నటించింది తక్కువ సినిమాలే అయినా పేరు మాత్రం బాగానే సంపాదించేసుకున్నారు. యువ హీరోలందరూ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ కావాలన్న స్థాయికి ఎదిగిపోయారు. ఇలాంటి నేపథ్యంలోనే నేచురల్ స్టార్ నాని సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇద్దరూ హీరోయిన్లు ఉన్నా అనుపమ పరమేశ్వరన్‌దే ఈ సినిమాలో కీ రోల్ అట. ఆమె నటించిన సినిమా ప్రేక్షకులందరినీ బాగా నచ్చిందట.
 
నాని కన్నా అనుపమ పరమేశ్వరన్‌ను సినిమాలో చూసేందుకు వస్తున్న ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉందని సినీ పరిశ్రమలోని వారు చెబుతున్నారు. సినిమా విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుండటంతో సినీ యూనిట్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎప్పుడూ ప్రేక్షకులు నాని కోసం వస్తే ఈ క్రిష్ణార్జున యుద్థం సినిమాకు మాత్రం అనుపమనే ఎక్కువగా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారట. 
 
మొత్తంమీద నానికి ఉన్న క్రేజ్ కన్నా అనుపమ పరమేశ్వరన్‌కు ఉన్న క్రేజే ఆ సినిమాకు విజయవంతంవైపు తీసుకెళుతుందంటున్నారు సినీ పరిశ్రమలోని వారు.