శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (16:58 IST)

'రంగస్థలం' "ఎంత సక్కంగున్నావే..." ఫుల్ సాంగ్ (వీడియో)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రంగస్థలం'. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల 30వ తేదీన విడుదలై బాక్సాఫీ రికార్డులను కొల్లగొట్టింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రంగస్థలం'. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల 30వ తేదీన విడుదలై బాక్సాఫీ రికార్డులను కొల్లగొట్టింది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ హిట్ కొట్టి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ.200 కోట్ల వ‌సూళ్ళు సాధించింది. సంగీత దర్శకుడు దేవి శ్రీ అందించిన సంగీతం, గీత రచయిత చంద్ర‌బాబు లిరిక్స్‌తో పాటు ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాశ్ రాజ్, అన‌సూయ‌ల నటన సినిమా స‌క్సెస్‌లో స‌గ‌భాగమయ్యాయి.
 
ఈ నేపథ్యంలో 'రంగస్థలం' నుంచి మొదటి సాంగ్ వీడియోను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. 'వేరుశనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగిలిన లంకేబిందెలాగ ఎంతసక్కగున్నావే.. లచిమి ఎంత సక్కంగున్నావే, సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యాబోతే చేతికి అందిన చందమామలాగ ఎంత సక్కగున్నావే.. లచిమి' అంటూ సాగే ఈ పాట ప్రతి ఒక్కరి మనసులను దోచుకుంది. మ‌
 
రి తాజాగా విడుద‌లైన ఎంత స‌క్కగున్నావే ఫుల్ వీడియో సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి. కాగా, ఈ పాటన శుక్రవారం యూ ట్యాబ్‌లో అప్‌లోడ్ చేయగా, కొన్ని గంటల్లోనే 19 లక్షల 99 వేల 580 మంది నెటిజన్లు వీక్షించారు. అలాగే 66 వేల మంది లైక్ చేయగా, 1.5 వేల మంది డిజ్‌లైక్ చేయడం గమనార్హం.