సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: శనివారం, 28 ఏప్రియల్ 2018 (17:19 IST)

ఆక‌ట్టుకుంటోన్న మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌ W/0 రామ్ టీజ‌ర్

న‌టిగా, నిర్మాత‌గా, వ్యాఖ్యాత‌గా.. రాణిస్తోన్న మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న తాజా చిత్రం W/0 రామ్. నూత‌న ద‌ర్శ‌కుడు విజ‌య్ య‌ల‌కంటి తెర‌కెక్కించిన ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, మంచు ఎంట‌ర్ టైన్మెంట

న‌టిగా, నిర్మాత‌గా, వ్యాఖ్యాత‌గా.. రాణిస్తోన్న మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న తాజా చిత్రం W/0 రామ్. నూత‌న ద‌ర్శ‌కుడు విజ‌య్ య‌ల‌కంటి తెర‌కెక్కించిన ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, మంచు ఎంట‌ర్ టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా టీజ‌ర్‌ను కింగ్ నాగార్జున ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. 
 
ఇంట్ర‌స్టింగ్‌గా ఉన్న టీజ‌ర్‌కి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. ఇక టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే... ' రామ్‌ను పై నుంచి తోసి చంపేశాడు సార్' అనే డైలాగ్‌తో ఈ టీజర్ మొదలవుతోంది. ప్రధాన పాత్రలపై కట్ చేసిన ఈ టీజర్ చూస్తుంటే, ఇది ఒక మర్డర్ మిస్టరీకి సంబంధించిన కథ అని తెలుస్తోంది. ఆదర్శ్ బాలకృష్ణ .. ప్రియదర్శి ముఖ్యమైన పాత్రలను పోషించారు. 
 
టీజ‌ర్ చూస్తుంటే... ఈ సినిమా ఆడేట‌ట్టే క‌నిపిస్తోంది. మంచి క‌థ ఉంటేనే ఓకే చెప్పే మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న ఇందులో న‌టించింది అంటే.. ఖ‌చ్చితంగా విభిన్న క‌థా చిత్రం అవుతుంది అన‌డం సందేహం లేదు. మ‌రి...''W/0 రామ్ ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.