శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (13:06 IST)

వైకాపాలోకి కాటసాని రాంభూపాల్ రెడ్డి.. కండువా కప్పిన జగన్

వచ్చే యేడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు క్రమంగా మారిపోతున్నాయి. రాజకీయ నేతలు పార్టీల్లో చేరడం, పార్టీ నుంచి విడిపోవడం వంటివి వరుసగా జరుగుతున్నాయి.

వచ్చే యేడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు క్రమంగా మారిపోతున్నాయి. రాజకీయ నేతలు పార్టీల్లో చేరడం, పార్టీ నుంచి విడిపోవడం వంటివి వరుసగా జరుగుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ఆదివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను కనుమూరు సమీపంలో కాటసాని కలుసుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పిన వైఎస్‌ జగన్‌ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 
 
పార్టీలో చేరికపై మాట్లాడిన కాటసాని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో పాణ్యం నియోజవర్గం ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని అన్నారు. నేడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో కలసి నడవడం తన అదృష్టమన్నారు. పంటలకు గిట్టుబాటు ధర  కల్పించడంలో రాష్ట్రం ప్రభుత్వం విఫలమైందని కాటసాని ఈ సందర్భంగా ఆరోపించారు.