1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YSRCP MP Y. V. Subba Reddy comments on Special Status

జగన్ మాటే వేదం... రాజీనామాలకు సిద్ధం : వైవీ సుబ్బారెడ్డి

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదాను ఇవ్వాలని వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానంటూ ఆ పా

YSRCP MP
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదాను ఇవ్వాలని వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానంటూ ఆ పార్టీ అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 
 
ప్రత్యేక హోదా నిమిత్తం తమ పార్టీ అధినేత జగన్ ఎప్పుడు రాజీనామా చేయమంటే అప్పుడు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను ఆయన కలిశారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని, జగన్ చెప్పిన వెంటనే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తామని అన్నారు. 
 
అయితే, ఇప్పుడే రాజీనామా చేయడంలో అర్థం లేదని, తాము రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా విషయమై పార్లమెంట్‌లో మాట్లాడేవారే ఉండరని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేసిన తర్వాత, తమ పదవులకు రాజీనామా చేస్తే ఉపయోగం ఉంటుందని సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. 
About Writer
pnr
తర్వాతి కథనం
ఆరెస్సెస్‌లోని మహిళలు నిక్కర్లు ధరించడం చూశారా?: రాహుల్ గాంధీ