1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. This World Gratitude Day, Swiggy partners with CARE Hospitals to organize Health Checkup Camp for delivery partners in Hyderabad

ప్రపంచ కృతజ్ఞత దినోత్సవం, CARE ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్న స్విగ్గీ

swiggy
హైదరాబాద్: భారతదేశపు మొదటి ఆన్-డిమాండ్ కన్వీనియెన్స్ ప్లాట్ ఫాం స్విగ్గీ హైదరాబాద్ లోని CARE ఆసుపత్రుల భాగస్వామ్యంతో ఈరోజు ఆరోగ్య పరీక్షల క్యాంప్ ను నిర్వహించింది. శ్రీమతి. హరి చందన దాసరి, సెక్రటరీ, స్కిల్ హ్యూమన్ కాపిటల్ మరియు నాలెడ్జ్ ట్రైనింగ్ కార్యక్రమాల విభాగం, తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రపంచ కృతజ్ఞత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ క్యాంపులో స్విగ్గీ ఫుడ్ మార్కెట్ ప్లేస్ మరియు ఇన్ స్టామార్ట్ వ్యాపారాలకు చెందిన వందలు డెలివరీ భాగస్వామ్యులు పాల్గొన్నారు. హెల్మెట్ల పంపిణీ కూడా కార్యక్రమంలో జరిగింది, ఇది డెలివరీ భాగస్వాముల భద్రత, సంక్షేమాలు పట్ల స్విగ్గీ యొక్క నిబద్ధతను పునః శక్తివంతం చేసింది.
 
ఆరోగ్య పరీక్షల క్యాంపులో ప్రాధమిక ఆరోగ్యం గురించి స్క్రీనింగ్( రక్తపోటు, పల్స్ మరియు బ్లడ్ షుగర్, బరువు అంచనాలు ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ సంప్రదింపులతో జోడించబడ్డాయి), సంప్రదింపుతో ECG( డాక్టర్ సిఫారసు మేరకు) చేర్చబడిన డయోగ్నిస్టిక్- ప్రత్యేకమైన సంరక్షణ, ఆఫ్తలమాలజి, డెంటల్ పరీక్షలు, న్యూట్రిషనిస్ట్ సంప్రదింపుతో బాడీ కాంపోజిషన్ అనాలిసిస్(BCA)చేర్చబడిన వెల్ నెస్ అంచనాలు సహా పరీక్షల శ్రేణి ఆరోగ్య పరీక్షల క్యాంపులో చేర్చబడ్డాయి. ఈ క్లీనికల్ స్క్రీనింగ్స్ మరియు వ్యక్తిగత వైద్య సంప్రదింపులను కేర్ హాస్పిటల్ అవుట్ పేషంట్ సెంటర్ కు చెందిన డాక్టర్లు మరియు శిక్షణ పొందిన నిపుణులు నిర్వహిస్తారు.
 
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, శ్రీమతి. హరి చందన దాసరి, సెక్రటరీ, స్కిల్ హ్యూమన్ కాపిటల్, నాలెడ్జ్ ట్రైనింగ్ కార్యక్రమాల విభాగం, తెలంగాణ ప్రభుత్వం ఇలా అన్నారు, “మన నగరాలకు డెలివరీ భాగస్వాముల తోడ్పాటు మరియు విస్తృతమైన ఆర్థిక వ్యవస్థ ప్రధానమైనవి. సరైన ఆరోగ్యం మరియు సంక్షేమం మద్దతుని పనివారు పొందేలా నిర్థారించడానికి  ఒక సమీకృత పని సిబ్బందిని రూపొందించడానికి ప్రధానం. హైదరాబాద్ లో ఈ ఆరోగ్య పరీక్షలను నిర్వహించడానికి మేము స్విగ్గీ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. పనివారి సంక్షేమాన్ని మద్దతు చేయడానికి భాగస్వాములచే నిరంతర ప్రయత్నాలను ప్రోత్సహిస్తాము.”
 
నేహా సింఘ్వి, వైస్ ప్రెసిడెంట్- కార్పొరేట్ వ్యవహారాలు, స్విగ్గీ ఇలా అన్నారు “మన రోజూవారీ జీవితాల్లో భాగంగా ఉన్న వ్యక్తులను గుర్తించడానికి, ప్రశంశించడానికి ప్రపంచ కృతజ్ఞతా దినోత్సవం ఒక మంచి అవకాశం. మన డెలివరీ భాగస్వాములు స్విగ్గీ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం మాత్రమే కాకుండా, మనం జీవించే నగరాల్లో ఒక అంతర్భాగం.  వారు ప్రతి రోజూ మన నగరాల నిర్వహణకు సహాయపడుతున్నారు. హైదరాబాద్ లో ఈ ఆరోగ్య పరీక్షా కార్యక్రమం వారి ఆరోగ్యం, సంక్షేమం మద్దతు చేసే దిశగా ఒక చిన్న చర్య, వారు చేసే పని అంతటికీ మన కృతజ్ఞతను వెల్లడించటానికి ఒక సాధారణమైన విధ.
 
సంవత్సరాలుగా, స్విగ్గీ భాగస్వాముల ఆర్థిక భద్రతను మరియు దీర్ఘకాలం సామర్థ్యాన్ని శక్తివంతం చేసే కార్యక్రమాల శ్రేణి లక్ష్యాన్ని చేపట్టింది: జెరోధ ఫండ్ హౌస్ తో మాకు గల భాగస్వామ్యం ద్వారా, డెలివరీ భాగస్వాములు అతి తక్కువగా రూ.100తో స్విగ్గీ రైడర్ యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారు; ఇన్-యాప్ ఆదాయం- పన్నును భర్తీ చేసే సదుపాయం 50,000 కంటే ఎక్కువమంది డెలివరీ భాగస్వాములు ఆదాయం పన్ను రిటర్న్స్‌ను (వారిలో 1/3వ వంతు ముందు మొదటిసారి దాఖలు చేసారు) దాఖలు చేయడానికి వీలు కల్పించింది,

రూ. 6.5 కోట్ల పన్ను-రిఫండ్ కు వీలు కల్పించింది; ముందస్తు చెల్లింపు ద్వారా, అర్హత కలిగిన డెలివరీ భాగస్వాములు తమ సంపాదనలో కొంత భాగాన్ని సాధారణ వీక్లీ (వారపు)చక్రం కంటే ముందు పొందవచ్చు. ఫలితంగా వారు తమ తక్షణ ఆర్థిక అవసరాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకోగలరు. ఈ కార్యక్రమాలు బీమా, ఆరోగ్యం మరియు అత్యవసర సహాయంతో సహా స్విగ్గీ యొక్క విస్తృత డెలివరీ-భాగస్వామి మద్దతు వ్యవస్థకు సహాయపడతాయి. 
About Writer
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
బీహార్ జముయిలో పదో తరగతి విద్యార్థినికి లైంగిక వేధింపులు, నిందితుడి కాలుపై కాల్చిన పోలీసులు, వీడియో