1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Karnataka Is Warning Against Eating Ummetha Pandu

ఉమ్మెత్తను అమ్మే డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం

Datura
Datura
అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ఆహార విక్రయ లైసెన్స్‌లను రద్దు చేయాలని కర్ణాటక ప్రభుత్వం అధికారులను ఆదేశించడంతో, ఉమ్మెత్త పూల అంశం మళ్లీ చర్చనీయాంశమైంది. ప్రజారోగ్యం-ఆహార భద్రతకు సంబంధించిన ఆందోళనల నేపథ్యంలో, ఉమ్మెత్త పండ్లు, విత్తనాలను ఆన్‌లైన్‌లో విక్రయించడం వల్లే ఈ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లపై, అలాగే వాటికి సరుకును సరఫరా చేసే సంస్థలు, విక్రేతలపై ఈ చర్యలు తీసుకున్నారు. ఆహారం లేదా మానవ వినియోగం కోసం ఉద్దేశించిన ఉమ్మెత్తకు సంబంధించిన లిస్టింగ్‌లు, ప్రకటనలు, ప్రచార సామగ్రిని తొలగించాలని సంబంధిత ఆహార వ్యాపార నిర్వాహకులను ఇది ఆదేశించింది.
 
ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌లు లేదా రిజిస్ట్రేషన్‌ల కింద కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అమ్మకానికి ఉంచిన ఉమ్మెత్త పండ్లు లేదా విత్తనాలు అధికారుల దృష్టికి రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆహారంగా లేదా మానవ వినియోగం కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వీటిని విక్రయించడం, పంపిణీ చేయడం, అమ్మకానికి ఉంచడం లేదా ప్రచారం చేయడం అనేది ప్రజారోగ్యం- ఆహార భద్రత దృష్ట్యా తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఆ శాఖ పేర్కొంది. 
 
ఉమ్మెత్త పండ్లు లేదా విత్తనాలకు సంబంధించిన అన్ని ఆన్‌లైన్ లిస్టింగ్‌లు, ప్రకటనలు, ప్రచార కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆహార వ్యాపార నిర్వాహకులను ఆ శాఖ ఆదేశించింది. అలాగే భవిష్యత్తులో ఆహారం లేదా మానవ వినియోగం కోసం వీటి అమ్మకం లేదా పంపిణీని ఖచ్చితంగా నిషేధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ సంస్థల లైసెన్స్‌ల సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపింది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
పిన్ని పిన్నీ అంటూ తరచూ ఇంటికి వచ్చి ఆమెతోనే వివాహేతర సంబంధం, భర్త చూసేసరికి...