రాజీనామా చేస్తే జస్ట్ రెండు నిమిషాల్లో ఆమోదిస్తాం : ఎమ్మెల్యేలకు సీఎం డీకే హెచ్చరిక
కర్నాటక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఈ విస్తరణ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆందోళనకు దిగారు. ముఖ్యంగా, మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేల నిరసనలు తీవ్రతరమ్యాయి.
బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యేలు కృష్ణప్ప, ఆయన కుమారుడు ప్రియకృష్ణ, మాజీ మంత్రి దినేశ్ గుండూరావు అనుచరులు, క్యాబినెట్‌లో మహిళలకు అవకాశం లేకపోవడంపై పలు ప్రాంతాల మహిళలు నిరసనకు దిగారు. సోమవారం విస్తరణ తర్వాత విజయపుర జిల్లా ఇండి ఎమ్మెల్యే యశ్వంతరాయగౌడ పాటిల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన బాటలోనే సుమారు 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తా. మని బెదిరిస్తున్నారు. వారి తీరుపై సీఎం డీకే శివకు మార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాజీనామా చేస్తే రెండే రెండు నిమిషాల్లో ఆమోదించేస్తామని హెచ్చరించారు. బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మంత్రివర్గంలోకి 33 మందిని మాత్రమే నియమించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. 'గతంలో ధరంసింగ్, సిద్ధరామయ్యలు మంత్రివర్గాల్లోకి నన్ను కూడా తీసుకోలేదు. నేనూ, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర సహనంతో ఉండలేదా? సహనంతో మెలగాలి. పార్టీ ముఖ్యం' అని సీఎం పేర్కొన్నారు. మరోవైపు సిద్దరామయ్య హయాంలో నియమితులైన బోర్డులు, కార్పొరేషన్ల చైర్మన్ల పదవీ కాలం రెండున్నరేళ్లు ముగిసిందని.. వెంటనే రాజీనామా చేయాలని సీఎం డికే వారిని ఆదేశించారు.
