మేషం: దైవ, సేవ, సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయావు చర్చకు వస్తాయి. మీ శక్తి సామర్ధ్యాలపై అందరికీ నమ్మకం ఏర్పడుతుంది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం.
వృషభం: వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. అవివాహితులు కొత్త అనుభూతికి లోనవుతారు. ఏజెన్సీలు, లీజు, టెండర్ల వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. స్థిరాస్తుల క్రయ విక్రయాలలో పునరాలోచన మంచిది. ఆపత్సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం.
మిథునం: కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు ఆలస్యంగా అందుతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు ఆలస్యంగా అందుతాయి. మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఉన్నతాధికారులకు తనిఖీలు, పర్యవేక్షణలో ఏకాగ్రత ముఖ్యం. కొన్ని సందర్బాల్లో మీ అంచనాలు, ఊహలు నిజమవుతాయి.
కర్కాటకం: ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. గృహంలో ఒక శుభ కార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. స్త్రీల ఆరోగ్యంలో ఆశించినంత సంతృప్తి కానవస్తుంది. వస్తు కొనుగోళ్లలో నాన్యతకే ప్రాధాన్యమిస్తారు. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి.
సింహం: ప్రయాణాలలోను, బ్యాంకు వ్యవహారాలలోను మెళకువ అవసరం. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. ముక్కుసూటిగా పోయే మీ తత్వం వివాదాలకు దారి తీస్తుంది. స్త్రీల అభిప్రయాలకు ఏ మాత్రం స్పందన ఉండదు.
కన్య: శ్రీవారు, శ్రీమతిల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ప్రేమికులకు ఓర్పు, సమయస్పూర్తి బాగా అవసరం. నూతన వ్యాపారాలు, వ్యాపారాల విస్తరణకు కావలసిన అనుమతులు, వనరులు సమకూర్చుకుంటారు. మీ అలవాట్లు, మాటతీరు ఇబ్బందులకు దారితీస్తుంది.
తుల: ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో కొంత పురోగతి సాధిస్తారు. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు.
వృశ్చికం: బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి సాధిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలపై చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
ధనస్సు: కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. ప్రముఖుల సిఫార్సుతో నిరుద్యోగులకు మంచి అవకాశం లభిస్తుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. మిత్రులలో వచ్చిన మార్పు నిరుత్యాహం కలిగిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, గృహంలో మార్పులు అనుకూలం.
మకరం: వ్యాపారాల అభవృద్ధికి చేపట్టిన పథకాలు మునుముందు మంచి ఫలితాలిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఏకాగ్రత ముఖ్యం. మీ శక్తిసామర్ధ్యాలపై విశ్యాసం సన్నగిల్లుతుంది. రుణాలు, చేబదుళ్లు స్వీకరించవలసి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం.
కుంభం: పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఆదాయానికి మించి ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఆటుపోట్లు ఎదుర్కుంటారు. ఆత్మీయుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.
మీనం: మీ ఆలోచనలు స్థిమితంగా ఉండవు. సన్నిహితుల హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. ధనం మితంగా వ్యయం చేయటం శ్రేయస్కరం. ఉమ్మడి, సొంత వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమిస్తారు. దూర ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి.