సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-06-2020 సోమవారం మీ రాశి ఫలితాలు.. కనకధారా స్తోత్రం చదివినా?

శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ఠ బహుళ తదియ రా. 9.41. 
పూర్వాషాఢ పగలు 3.44 గంటల వరకు
వర్జ్యం.. ఉదయం 11.52 గంటల నుంచి మధ్యాహ్నం 1.28 వరకు
దుర్ముహూర్తం - పగలు 12.23 గంటల నుంచి 1.15 వరకు 
 
కనకధారా స్తోత్రం చదివినా లేక విన్నా ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి పొందుతారు. 
 
మేషం: విద్యార్థినులకు ఇంజనీరింగ్, మెడికల్, లా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. అంతగా పరిచయం లేని వ్యక్తులతో అప్రమత్తంగా మెలగండి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలు షాపింగ్ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం.
 
వృషభం: బంధువుల రాకతో గృహంలో చికాకులు, ఖర్చులు అధికమవుతాయి. సోదరీ, సోదరుల మధ్య ఆస్తి విషయాల గూర్చి తగాదాలు రావచ్చు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాల వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి.
 
మిథునం: విదేశాల్లో ఉంటున్న ఆత్మీయుల క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు, ఇతర కార్యక్రమాలు వాయిదా పడతాయి. పూర్తిగా చదవకుండా సంతకాలు చేయకండి. కొంతమంది మీ బలహీనతలను కనిపెట్టి లబ్ధి పొందాలని యత్నిస్తారు. పండ్లు, పూలు, కొబ్బరి. చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
కర్కాటకం: విదేశీయానాలకై చేయు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. పీచు, ఫోమ్, లెదర్ వ్యాపారులకు పురోభివృద్ధి. కుటుంబీకులు, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రతి పనీ ఉత్సాహంగా పూర్తి చేస్తారు. మిత్రుల సహాయంతో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. 
 
సింహం: మీ శ్రీమతి, శ్రీవారి ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. కొన్ని సందర్భాల్లో రిస్క్ తీసుకోవాల్సి వచ్చినా చివరికి మంచే జరుగుతుంది. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు.
 
కన్య: కుటుంబంలో చికాకులు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. విద్యుత్, ఏసీ కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. ప్రేమికులకు ఎడబాటు, ఇతరత్రా చికాకులు తప్పవు. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి.
 
తుల: మీ కలల్ని నిజం చేసుకోవడానికి ఇది తగిన సమయం. కష్టించి పనిచేసే వారికి ఫలితం దక్కుతుంది. గణిత, సైన్స్ రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి అధికం. శ్రమాధిక్యత, అకాల భోజనం వంటి చికాకులు తప్పవు. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. కొత్త పరిచయాల వల్ల లబ్ధి పొందుతారు.
 
వృశ్చికం: వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు పురోభివృద్ధి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
ధనస్సు: ఆహార వ్యవహారాల్లో పరిమితి పాటించండి. కంది, మినుము, మిర్చి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం వుంది. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. మొండి బకాయిలు వసూలు కాగలవు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది.
 
మకరం: ఇతరులకు ధనం ఇచ్చినా తిరిగి రాజాలదు. స్త్రీల మనోవాంఛలు నెరవేరటంచో కొత్త అనుభూతికి లోనవుతారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. వాహనం, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి.
 
కుంభం: వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ వుండదు. ముఖ్యమైన విషయాలు గోప్యంగా వుంచండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. విద్యార్థులకు కోరుకున్న కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు. భాగస్వామికుల మధ్య అవగాహన లోపిస్తుంది. 
 
మీనం: దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. ఒక వ్యవహారం నిమిత్తం ఒకటికి పదిసార్లు ప్రయత్నించాల్సి వుంటుంది. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. కోర్చు వ్యవహారాలు ముందుకు సాగవు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. మీ సంతానం ఉన్నతి కోసం బాగా శ్రమిస్తారు.