సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-06-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు.. సదాశివుని ఆరాధించి..?

సదాశివుని ఆరాధించి విభూధి ధరించినట్లైతే శుభం, జయం కలుగుతుంది. 
 
మేషం: కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. మీ గౌరవాభిమానాలకు భంగం కలుగుకుండా మెలగాలి. 
 
వృషభం: బంధువుల నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కొవలసి వస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. శుభకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. కొత్త కొత్త స్కీములతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఒక స్థిరాస్తి తాకట్టుతో మీ అవసరాలు నెరవేరగలవు.
 
మిథునం: ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదు. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. కొత్త కొత్త వ్యాపార రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు షాపింగ్ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం.
 
కర్కాటకం: మీ అభిప్రాయాలకు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా వుండటం క్షేమదాయకం. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల నిష్ఠూరాలు, పట్టింపులు ఎదుర్కొవలసి వస్తుంది. విద్యార్థులకు విదేశీ వస్తువుల విషయంలో అడ్డంకులు తొలగిపోగలవు. 
 
సింహం: శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. హోటల్, క్యాటరింగ్ పనివారలకు పనిభారం అధికమవుతుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్దమొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి.
 
కన్య: ఊహించని ఖర్చులు, బంధువుల రాక వల్ల మానసికాందోళన తప్పదు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కుటుంబీకులు, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుచారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. రాజకీయాల్లో వారు విరోధులు వేసే పథకాలను తెలివితో తిప్పిగొట్ట గలుగుతారు. 
 
తుల: చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. 
 
వృశ్చికం: స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పండ్లు, పూలు, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు శుభదాయకం. మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల మనస్సులను బాధపెట్టకండి.
 
ధనస్సు : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. మీ ధైర్య సాహసాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ధనం నిల్వచేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. 
 
మకరం: మీ శ్రీమతి, సంతానం గొంతెమ్మ కోరికలు ఇబ్బంది కలిగిస్తాయి. ఏజెన్సీలు నూతన కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన అవసరం. వ్యాపారాల్లో పోటీని తట్టుకోవటానికి బాగా శ్రమించాలి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. 
 
కుంభం: వారసత్వపు వ్యవహారాల్లో చికాకులు ఎదుర్కొంటారు. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు, ప్రణాళికలు ఫలిస్తాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు పనిభారం అధికమవుతుంది. 
 
మీనం: నిరుద్యోగులకు లభించినట్లైతే తాత్కాలిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. ముఖ్యమైన వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ఎక్కడో పొరపాటు చోటుచేసుకుంటుంది. స్త్రీలకు పుట్టింటిపై మమకారం పెరుగుతుంది. ఏసీ, కూలర్, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది.