సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

04-06-2020 గురువారం రాశి ఫలితాలు - కుబేరుని ఆరాధించినా...

మేషం : వ్యాపారస్తులకు ప్రభుత్వ అధికారుల నుంచి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. క్రయవిక్రయ రంగాల వారికి నూతన ఉత్సాహం కానవస్తుంది. ఆత్మీయులకు విలువైన బహుమతులు అందిస్తారు. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
వృషభం : రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. చెల్లింపులు వాయిదావేస్తారు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు. చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం తగ్గుతుంది. 
 
మిథునం : వృత్తి, వ్యాపారాలలో మీ అంచనాలు ఫలించక పోవచ్చు. వాహనం నడుపునపుడు మెలకువ అవసరం. మీ శ్రీమతి మొండి వైఖరి మీకు ఎంతో చికాకు, ఆందోళన కలిగిస్తుంది. వీసా, పాస్‌పోర్టులకు సంబంధించిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. మిత్రుల సహకారంతో ఓ సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. 
 
కర్కాటకం : నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి. పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త వహించండి. ఉమ్మడి విధులు నిర్వహణలో మాటపడవలసివస్తుంది. విదేశీయాన యత్నాలు ముమ్మరం చేస్తారు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. సోదరీ, సోదరుల మధ్య ఆస్తి విషయాల గూర్చి తగాదాలు రావొచ్చు. 
 
సింహం : మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిదికాదు. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులే అనుకూలిస్తాయి. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం, విందుభోజనం, వస్త్రలాభం వంటి శుభపరిణామాలు ఉంటాయి. మీ పనులు మందకొడిగా సాగుతాయి. మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. 
 
కన్య : ఆదాయానికి మించి ఖర్చులు అధికం. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు సామాన్యంగా ఉంటాయి. రాతకోతలు, ప్రయాణాలు లాభించకపోవచ్చు. వ్యాపార విషయాల్లో ఏకాగ్రత అవసరం. ఎదుటివారిలో మితంగా సంభాషించడం మంచిది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. 
 
తుల : స్థిరాస్తులు, వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. ప్రముఖులతో వాగ్వివాదాలకు దిగకండి. కీలకమైన వ్యవహారాలు మీ జీవితభాగస్వామికి తెలియజేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. అనుకున్న కార్యములు మధ్యలో నిలిచిపోవును. ధనం అందడంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. 
 
వృశ్చికం : వ్యాపారాలకు పోటీ పెరగడంతో ఆశించినంత ఆర్థిక సంతృప్తి ఉండదు. పొదువు దిశగా ఆలోచిస్తారు. రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ప్రముఖుల సలహా పాటించడం మంచిది. అనవసరపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. 
 
ధనస్సు : ఉద్యోగస్తులు తరచూ సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఎప్పటి నుంచో వాయిదాపడుతున్న పనులు పునఃప్రారంభమవుతాయి. హామీలకు సంబంధించిన విషయాలలో పునరాలోచన అవసరం. కుటంబ వ్యక్తులతో స్వల్ప విరోధముల రావచొచ్చు. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త చాలా వహించండి. 
 
మకరం : శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత అవసరం. ఆస్తి వ్యవహారాల విషయంలో దాయాదుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రేమికుల మధ్య అనుమానాలు, అపోహలు చోటుచేసుకుంటాయి. 
 
కుంభం : భాగస్వామిక చర్చలలో కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి. విద్యార్థినులు పట్టుదలతో శ్రమించిన సత్ఫలితాలు సాధించగలరు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. పత్రికా సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీ మూలకంగా కలహాలు, ఇతరాత్రా చికాకులు ఎదురవుతాయి. 
 
మీనం : కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. కోపంతో పనులు చక్కబెట్టుకోలేరు. పాత మిత్రుల కలయికతే మానసికంగా కుదుటపడతారు. శాస్త్ర, సాంకేతిక, కళ, క్రీడా రంగాల వారికి అనుకూలం. రాజకీయ నాయకులకు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఒక స్థిరాస్తి విక్రయించాలన్న ఆలోచన స్ఫురిస్తుంది.