శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : ఆదివారం, 31 మే 2020 (09:07 IST)

31-05-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆదిత్య హృదయం చదివినా..?

ఆదిత్య హృదయం చదివినా లేకుంటే విన్నా సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: విందులు, విలాసాలలో మితంగా వ్యవహరించండి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. పెద్దల సలహా పాటించడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సివస్తుంది.
 
వృషభం: పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధువుల రాక వల్ల తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఫైనాన్స్ రంగాల్లోని వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటారు.
 
మిథునం: విద్యార్థులు క్రీడా రంగాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. స్త్రీలకు పుట్టింటి నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. పెద్దలతో ఏకీభవించలేకపోతారు. మిత్రులను కలుసుకుంటారు. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల గురించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.
 
కర్కాటకం: ఒకానొక వ్యవహారంలో మీ ప్రమేయం మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. రాజకీయ నాయకులకు, ప్రయాణాల్లో మెళకువ అవసరం. కొత్త కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు.
 
సింహం: ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని చేపట్టిన పనులు పూర్తికావు. ధనం ఎంత వస్తున్నా నిల్వచేయలేకపోతారు. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. ప్రముఖుల కలయిక సాధ్యపడుతుంది. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికై యత్నిస్తారు.
 
కన్య: చిన్నారులకు విలువైన బహుమతులు అందజేస్తారు. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు షాపింగ్‌లోనూ, చెల్లింపులోను అప్రమత్తత చాలా అవసరం. ప్రతి విషయంలోను ఓర్పు, సంయమనం చాలా ముఖ్యం.
 
తుల: ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఖర్చులు అధికంగా వెచ్చిస్తారు. రాజకీయ కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలం. మీ మనస్సుకు నచ్చని సంఘటనలు జరుగుతాయి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. ఒక వ్యవహారం నిమిత్తం కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. 
 
వృశ్చికం: దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సభాసమావేశాల్లో పాల్గొంటారు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. వ్యవహార లాభం, అనుకోకుండా కొన్ని అవకాశాలు కలిసిరావడం వంటి మంచి ఫలితాలుంటాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
ధనస్సు: ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. స్త్రీలు దైవ, పుణ్యకార్యాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఆస్తి వ్యవహారాల్లో పెద్దల వైఖరి నిరుత్సాహ పరుస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు.
 
మకరం: సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. దూర ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. మీ కుటుంబీకుల పట్ల మమకారం అధికమవుతుంది. నిరుద్యోగుల ఆలోచనలను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తారు.
 
కుంభం: నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలరు. విద్యార్థులకు విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఒక్కోసారి మాటపడవలసి వుంటుంది. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. మీ సంతానం పై చదువుల కోసం బాగా శ్రమించాల్సి ఉంటుంది.
 
మీనం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం లభిస్తుంది. ఇతరులను అతిగా విశ్వసించడం వల్ల నష్టపోయే ప్రమాదం వుంది. నూతన వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం. మీ యత్నాలకు బంధువులు సహకరిస్తారు. స్త్రీలకు అలంకరణలు, విలాస వస్తువుల మీద ఎక్కువ పెరుగుతుంది.