సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

30-05-2020 శనివారం దినఫలాలు

మేషం : ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. రుణం కొంత మొత్తం తీర్చడంతో కుదుటపడతారు. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. వ్యాపారాలు, గృహంలో సందడి కానవస్తుంది. 
 
వృషభం : రాజకీయాల్లో వారికి అనుకోని మార్పు కానరాగలదు. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదావేయడం మంచిది. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు ఆశాజనకం. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల వారికి శ్రమాధిక్యత. 
 
మిథునం : ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది. మీ చిత్తశుద్ధి, నిజాయితీలకు ప్రశంసలు లభిస్తాయి. విందులలో పరిమితి పాటించండి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. 
 
కర్కాటకం : సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. మొహమ్మాటం వీడి బంధుమిత్రులతో ఖచ్చితంగా వ్యవహరించండి. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
సింహం : అధిక ఉష్ణ వల్ల మీ సంతానం ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే వషయంలో పునరాలోచన చాలా అవసరం. 
 
కన్య : ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళకు మెళకువ అవసరం. విద్యార్థులకు కొత్త ఆలోచనలు స్ఫూరిస్తాయి. ఉద్యోగ యత్నంలో దళారులను విశ్వసించకండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. 
 
తుల : బంధు మిత్రులతో ప్రయాణాలు సాగిస్తారు. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగాసాగవు. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులు తప్పవు. ఫ్యాన్సీ, మందులు, రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసిరాగలదు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. 
 
వృశ్చికం : ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిదికాదు. ఇతరులపై ఆధారపడక ప్రతి విషయంలోనూ మీరే నిర్ణయం తీసుకోవడం మంచిదని గమనించండి. కొరియర్ రంగాల వారికి పనిభారం తప్పదు. మధ్యవర్తిత్వం వహించడం వల్ల మాటపడక తప్పదు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
ధనస్సు : హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబీకులతో కలిసి దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. ఖర్చులు సామాన్యం. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. అనుకోని విధంగా మొక్కుబడులు చెల్లిస్తారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది రాజకీయ నాయకులకు కార్యకర్తల వల్ల చికాకులు తప్పవు. బంధువుల రాకతో ఖర్చులు అధికం. 
 
కుంభం : ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ప్రైవేటు సంస్థలలో వారికి సామాన్యంగా ఉంటుంది. మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చే కాలం. రావలసిన ధనం అందటంలో తనాఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. 
 
మీనం : వార్తా సంస్థలలోని వారికి మందకొడిగా ఉంటుంది. టెక్నికల్ కంప్యూటర్ రంగాలలోని వారికి సత్‌కాలం. బంధుమిత్రులకు మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో పునరాలోచన మంచిది. వృత్తి వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటాయి.