గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

26-05-2020 మంగళవారం దినఫలాలు - మనోవాంఛలు నెరవేరాలంటే...

మేషం : ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. మీ పనులు, వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ఆలయాలను సందర్శిస్తారు. 
 
వృషభం : పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. శ్రీవారు, శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. మీ విషయాల్లో జోక్యానికి తావివ్వడం మంచిది కాదని గమనించండి. 
 
మిథునం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. పెద్దమొత్తం ధనం చెల్లింపులో ఆలోచన, తోటివారి సలహా తీసుకోవం ఉత్తమం. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మార్కెటింగ్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. 
 
కర్కాటకం : వైద్య రంగాల్లో వారికి పురోభివృద్ధి. విద్యార్థులు ఉన్నత విద్యలకై చేయు యత్నాలు ఫలిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాకయం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాలు వాయిదా వేయడం మంచిది. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. 
 
సింహం : కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాకయంగా ఉంటుంది. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం అధిక సమయం వేచి ఉండాల్సివస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేయాలనే మీ ఆలోచన వాయిదపడుతుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. 
 
కన్య : కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ సమస్యలకు చక్కని పరిష్కారమార్గం లభించును. మిత్రుల సహకారం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. టీవీ, రేడియో రంగాల వారికి అనుకూలం. స్త్రీలకు, షాపింగ్‌లకు ధనం బాగా ఖర్చు చేస్తారు. 
 
తుల : మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదాపడతాయి. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, శ్రమాధిక్యత ఆధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఉమ్మడి నిధులు నిర్వహణ విషయంలో ఆచితూచి వ్యవహరించండి. 
 
వృశ్చికం : ఆర్థిక విషయాల్లో సంతృప్తికానవస్తుంది. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. ప్రయాణాల్లోనూ, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. స్త్రీలు ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. చేతి వృత్తులు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. 
 
ధనస్సు : ఆర్థికంగాను, మానసికంగాను కుదుటపడతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయడం శ్రేయస్కరం. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయులతో కలిసి విహార యాత్రలలో పాల్గొంటారు. 
 
మకరం : ఆర్థిక వ్యవహారాల్లో మొహమ్మాటం కూడదు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు ఆదుకుంటారు. క్రయ విక్రయాలు సామాన్యం. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలకు బంధువుల నుంచి మొహమ్మాటం, ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. 
 
కుంభం : వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ, వ్యాపారులకు కలిసిరాగలదు. చేతి, వృత్తులు, వైద్య రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. అదనపు సంపాదన కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. 
 
మీనం : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కంది, నూనె, మిర్చి వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. కలప, ఇటుక, ఐరన్ వ్యాపారులకు అనుకూలం.