శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

25-05-2020 సోమవారం దినఫలాలు - ఇష్టకామేశ్వరి దేవిని ఆరాధిస్తే...

మేషం : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. మీ ఓర్పు, నేర్పులకిది పరీక్షా సమయం. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించండి. స్త్రీలు పనివారలతో సమస్యలు ఎదుర్కొంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. 
 
వృషభం : కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు ఆశాజనకం, నిరుద్యోగులు చేపట్టిన పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి రాగలవు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు కార్మికుల వల్ల ఇబ్బందులు తప్పవు. విద్యార్థులకు శుభవార్తా శ్రవణం. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. 
 
మిథునం : వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాలు అనుకూలం. పొదువు ఆవశ్యకతను గుర్తిస్తారు. ఉపాధ్యాయులకు మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అనుకూలం. 
 
కర్కాటకం : ఏ వ్యక్తినీ అతిగా విశ్వసించడం మంచిది కాదు. వాహనం నడుపుతున్నపుడు మెలకువ ఏకాగ్రత వహించండి. రాబడికి మించిన ఖర్చులు పెరిగినా ధరలు నిరుత్సాహపరుస్తాయి. చేతిలో ధనం నిలవడం కష్టమవుతుంది. స్త్రీలకు అయినవారితో పట్టింపులెదురవుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. 
 
సింహం : సిమెంట్, కలప వ్యాపారులకు పురోభివృద్ధి. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందిపడుతారు. కొత్త షేర్ల కొనుగోళ్ళలో పునరాలోచన అవసరం. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు కార్మికులతో చికాకులు తలెత్తుతాయి. ఒక వ్యవహారం నిమిత్తం ప్రయాణం చేయవలసి వస్తుంది. భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. 
 
కన్య : ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి అందిన ఒక సమాచారం మీలో కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. ప్రముఖుల కలయిక అనుకూలించినా ఆశించిన ప్రయోజనకరంగా ఉండదు. ఆపత్సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. నిరుద్యోగులు, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. 
 
తుల : విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు అధికం. పోగొట్టుకున్న పత్రాలు, వస్తువులు, తిరిగి సమకూర్చుకుంటారు. దైవదర్శనాలు చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. యోగ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణ యత్నాలు అనుకూలిస్తాయ. 
 
వృశ్చికం : దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. స్త్రీల ప్రతిభాపాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం బలపడుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
ధనస్సు : బంధువుల ద్వారా ఒక ఆసక్తికరమైన సమాచారం వింటారు. మొండి బాకీలు వసూలవుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు సదావకాశాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో అవగాహన ఏర్పడుతుంది. ప్రయాణాల్లో ఊహించని చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
మకరం : మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలుపెడతారు. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న సంకల్పం నెరవేరదు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. చిట్స్, ఫైనాన్స్, రంగాల వారికి ఖాతాదారులతో అవగాహన లోపిస్తుంది. ప్రముఖ కంపెనీల షేర్ల విలువ పుంజుకుంటాయి. 
 
కుంభం : మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు, అనుకూలిస్తాయి. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. సర్దుబాటు ధోరణితో వ్యవహరించి కొన్ని సమస్యలను అధికమిస్తారు. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. 
 
మీనం : ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి ఆందోళన తప్పదు. భాగస్వామిక వ్యాపారాలు జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. విద్యార్థులు పరీక్షల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు అయినవారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ప్రయాణాలు, బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి.