సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 27 మే 2020 (09:40 IST)

27-05-2020 బుధవారం దినఫలాలు - మల్లిఖార్జున స్వామిని పూజిస్తే...

మేషం : ఆర్థిక వ్యవహారాలలో పురోభివృద్ధి కానవస్తుంది. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత అవసరం. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. స్థిరాస్తిని అమ్మటానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. పత్రికా సంస్థలోని వారికి చిన్న చిన్న పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. 
 
వృషభ : రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. బంధువుల రాక వల్ల పనులు వాయిదాపడతాయి. సోదరులతో వివాదాలు నెలకొంటాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. ఉద్యోగస్తులకు ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని అడగండి. 
 
మిథునం : ఉమ్మడి వ్యాపారాల పట్ల ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. బంధు మిత్రులతో కోపతాపాలు సామాన్యంగా ఉంటాయి. ఇతరుల ముందు మీ కుటుంబ సమస్యలు ఏకరవు పెట్టడం మంచిదికాదని గమనించండి. 
 
కర్కాటకం : ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మిక విద్యుత్ వంటి సమస్యలు ఎదుర్కొంటారు. బంధుత్వాని కంటే వ్యవహారానికే ప్రాధాన్యం ఇవ్వండి. గతం కంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. స్త్రీలతో కలహములు, అన్ని కార్యములయందు విఘ్నములు ఎదుర్కొంటారు. 
 
సింహం : రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ చాలా అవసరం. బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో ఏకాగ్రత వహించండి. దైవ దర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలించవు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు అనుకూలమైన కాలం. 
 
కన్య : నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. 
 
తుల : ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం మంచిది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. చేతివృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. పాత మిత్రులతో కలయికతో మానసికంగా కుదుటపడతారు. బంధుమిత్రుల నుంచి అపనిందనలు ఎదుర్కొంటారు. 
 
వృశ్చికం : విదేశాలకు వెళ్లడానికి చేయుయత్నాలు వాయిదాపడతాయి. వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలలో దాగియున్న రచనా పటిమకు, కళాత్మతకు మంచి గుర్తింపు, పోత్సాహం లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ఉవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. 
 
ధనస్సు : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వైద్య శిబిరంలోని వారు తరచూ ఒత్తిడులకు గురవుతారు. దంపతుల మధ్య చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. 
 
మకరం : కోళ్ళు, మత్స్యు రంగాల్లో వారికి చికాకులు తప్పవు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి పనిభారం బాగా పెరుగుతుంది వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
కుంభం : కలప, ఐరన్, వ్యాపారులకు కలిసివచ్చే కాలం. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. ప్రయాణాలు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు ఒక వార్త ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. తలచిన పనులలో కొంత అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లోపం వల్ల అలసట అధికమవుతుంది. 
 
మీనం : పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కీలక సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ముఖ్యుల కోంస ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు.