సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

02-06-2020 మంగళవారం రాశి ఫలితాలు.. దేవి ఖడ్గమాల పఠిస్తే...

మేషం : స్థిరాస్తి క్రయవిక్రయాల్లో మధ్యవర్తుల మిమ్మలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. కోర్టు వ్యవహారాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఏ అవకాశం కలిసిరాక నిరుద్యోగులు ఆందోళన చెందుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు.
 
వృషభం : వార్తాసంస్థలలోని  సిబ్బందికి మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. కొత్త రుణాలు కోసం అన్వేషిస్తారు. రాజకీయ కళా రంగాల వారికి కొంత అనుకూలిస్తుంది. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. నూతన ప్రదేశాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో మీ శ్రీమతి సలహా పాటించడం మంచిది. 
 
మిథునం : ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురైనా మనశ్శాంతి లోపిస్తుంది. భార్యాభర్తల మధ్య అవగాహన లేక చికాకులు వంటివి ఎదుర్కొంటారు. దైవ, దర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, సముచిత హోదా, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభఫలితాలున్నాయి. కళ్యాణ మండపాల కోసం అన్వేషిస్తారు. 
 
కర్కాటకం : రావలసిన బకాయిలు వాయిదాపడుట వల్ల ఆందోళనకు గురవుతారు. కొన్ని విషయాల్లో మిత్రులు మీ అభిప్రాయాలను వ్యతిరేకిస్తారు. చిన్న చిన్న విషయాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులు ఒత్తిడి అధికం ఉంటుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. 
 
సింహం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. ప్రముఖులను కలుసుకుంటారు. విద్యా సంస్థలకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. స్త్రీలకు బంధువుల తాకిడివల్ల ఒత్తిడి, పనిభారం తప్పవు. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. 
 
కన్య : ఆర్థిక సమస్యలు తలెత్తినా మిత్రుల సహకారంతో సమసిపోగలవు. ప్రేమికుల మధ్య అవగాహన లోపం, అపార్థాలు చోటు చేసుకుంటాయి. మీ చుట్టు పక్కల వారు మీ సహాయం అర్థిస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులకు కొన్ని నిర్బంధాలకు లోనవుతారు. 
 
తుల : విద్యుత్, ఏసీ కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి తగు ప్రోత్సాహం లభిస్తాయి. స్థిరాస్తిని అమ్మడానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. ఊహించని ఖర్చులు, బంధువుల రాకవల్ల మానసికాందోళన తప్పదు. 
 
వృశ్చికం : లౌక్యంగా వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. వైద్య, ఇంజనీరింగ్, టెక్నికల్ విద్యార్థులు సామాన్య ఫలితాలే సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు నూతన బంధుత్వాలు ఏర్పడతాయి. 
 
ధనస్సు : పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తుల శక్తి సామర్థ్యాలను అధికారులు గుర్తిస్తారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ఆకస్మికంగా దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. 
 
మకరం : సంఘంలో మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. చేతి వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. మిత్రులను అధికంగా నమ్మడం వల్ల నష్టపోతారు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. 
 
కుంభం : కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. చిన్న చిన్న విషయాలలో ఉద్రేకం మాని ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగి రాజాలదు. 
 
మీనం : విద్యా రంగంలోని వారికి నూతన ఉత్సాహం, పురోభివృద్ధి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది.