శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

01-06-2020 రాశి ఫలితాలు.. మల్లికార్జున స్వామిని పూజిస్తే సంకల్ప సిద్ధి...

మేషం: సినిమా, విద్యా, సాంస్కృతిక, కళా రంగాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. మానసిక స్థైర్యంతో అడుగు ముందుకేయండి. అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో ఆందోళనలను ఎదుర్కొంటారు. కుటుంబీకుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచితులతో మెళకువ అవసరం. 
 
వృషభం: ఉద్యోస్తులకు అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చుతప్పుడు పడుటవలన మాట పడవలసివస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. ఏ అవకాశం కలిసిరాక నిరుద్యోగులు ఆందోళన చెందుతారు. ఖర్చులు అధికమవుతాయి.
 
మిథునం: పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల మేలే జరుగుతుంది. ఇంజనీరింగ్ రంగాల వారికి చికాకులు తప్పవు. కొన్ని బంధాలు మీకు అనుకూలంగా మారి మిమ్మల్ని ఆనందంలో ముంచుతాయి.
 
కర్కాటకం: ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. ప్రత్యర్థుల తీరును గమనించి తదనుగుణంగా వ్యవహరించండి. కోపంతో పనులు చక్కబెట్టలేరు.
 
సింహం: వ్యాపార వ్యవహారాల్లో జాయింట్ సమస్యలు రావచ్చును. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి లోనవుతారు. దంపతుల మధ్య సమస్యలు తలెత్తుతాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్యమైన విషయాలు చర్చించుకుంటారు. 
 
కన్య: కాంట్రాక్టర్లు తొందరపడి సంభాషించడం వల్ల సమస్యలు తప్పవు. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులు తప్పవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రాజకీయ నాయకులు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ, ఆర్థిక విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు.
 
తుల: మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్ధేశంతో ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఎంతో కాలంగా వేధిస్తున్నా సమస్యలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం వుంది. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. సోదరి, సోదరుల మధ్య ఏకీభావం కుదరదు.
 
వృశ్చికం: ఇంటి రుణాలు కొన్ని తీరుస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం పెరుగుతాయి. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. మీ కళత్ర సేవలు, ప్రేమాభిమానాలు సంతోషపరుస్తాయి. పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి చూపుతారు. బంధువులతో విరోధాలు తలెత్తుతాయి.
 
ధనస్సు : ఒక అవసరానికి ఉంచిన ధనం మరొకదానికి వినియోగించాల్సి వస్తుంది. స్త్రీలు షాపింగ్‌లోను, కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వుండాలి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కలిసిరాగలవు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి కొన్ని సమస్యలు తీరుతాయి. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. 
 
మకరం: స్త్రీలకు ఆరోగ్యభంగం, వైద్య సేవలు తప్పవు. బ్యాంకు పనులు వాయిదా పడతాయి. సజ్జన సాంగత్యం, సభలు, సమావేశాల్లో గౌరవం పొందుతారు. వ్యాపార వ్యవహారాల్లో జాయింట్ సమస్యలు రావచ్చును. నిరుద్యోగుల ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో కాలం గడుపుతారు.
 
కుంభం : వృత్తుల వారికి ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. స్త్రీలకు బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు తప్పవు. పెద్దమొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి. దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. 
 
మీనం: కొత్త కొత్త స్కీములతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానాలు, బహుమతులు లభిస్తాయి. ఒక స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. చేపట్టిన పనులు ఆలస్యంగానైనా పూర్తవుతాయి. భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది.