సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

03-06-2020 బుధవారం మీ దినఫలాలు- గణపతిని ఎర్రని పూలతో పూజించినా...

మేషం : ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన సందర్భాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరించే ప్రమాదం ఉంది. అవసరానికి డబ్బు చేతికందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. 
 
వృషభం : విద్యార్థులు కొత్త అనుభూతికి లోనవుతారు. వివాదాస్పద వ్యవహారాలు సమర్థంగా పరిష్కరిస్తారు. వాహన చోదకులకు స్వల్ప ఆటంకాలు తప్పవు. ఉద్యోగస్తుల, శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. 
 
మిథునం : గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేక ప్రత్యేక ఇంక్రిమెంట్ వంటి శుభపరిణామాలుంటాయి. కీలకమైన కొనుగోళ్ళు లాభిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ శాఖతో అవగాహన లోపిస్తుంది. 
 
కర్కాటకం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగావారికి ఆశాజనకం. భాగస్వామిక చర్చల్ల మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లాభిస్తాయి. ఒకనొక విషయంలో మిత్రుల తీరు ఆగ్రహం కలిగిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. 
 
సింహం : రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లలో ప్రతికూలతలు ఎదురవుతాయి. ఖర్చులు పెరగడంతో రుణాలు, చేబదుళ్లు తప్పవు. ప్రేమికుల ఎడబాటు, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం, వస్తుప్రాప్తి వంటి శుభఫలితాలుంటాయి. సంఘంలో మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. 
 
కన్య : పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. నూతన వ్యాపారాలకు కావలిసిన పెట్టుబడుల కోసం యత్నాలు సాగిస్తారు. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. చేపట్టిన పనుల కొంత ఆలస్యంగా పూర్తిచేస్తారు. 
 
తుల : ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. నిరుద్యోగులకు ఉపాధి పథకాల్లో రాణిస్తారు. రావలసిన ధన వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. బంధువుల మీ నుంచి ధనసహాయం కోరవచ్చు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. విద్యార్థుల్లో ఆందోళన తొలగిపోయి నిశ్చింతకు లోనవుతారు. 
 
వృశ్చికం : సభలు, సమావేశాలు, వేడుకల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. మిత్రులను కలుసుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతిపథంలో కొనసాగుతాయి. ఖర్చుల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. 
 
ధనస్సు : గృహ మరమ్మతులు, నిర్మాణాలు చేపడతారు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం. మీ బలహీనతలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
మకరం : స్త్రీలలో ఉత్సాహం, పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. ఎల్ఐసి, పోస్టల్, ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. 
 
కుంభం : రుణాల కోసం అన్వేషిస్తారు. గృహంలో ఒక శుభకార్యం సానుకూలమవుతుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. వృత్తులవారికి శ్రమకు తగిన ప్రతిఫలం, మంచి గుర్తింపు లభిస్తాయి. విద్యార్థులు రేపటి గురించి ఆందోళన చెందుతారు. 
 
మీనం : ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ఎంతో ముఖ్యం. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయలవలసి వస్తుంది. షేర్ల కొనుగోళ్ళు లాభిస్తాయి. సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది.