సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

05-06-2020 శుక్రవారం రాశిఫలితాలు - స్థిరలక్ష్మీదేవిని ఎర్రని పూలతో ఆరాధిస్తే...

మేషం : కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. కార్యసాధనలో పట్టుదలతో వ్యవహరించి సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తుల సమర్థత, చాకచక్యానికి అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థలలో వారికి తోటివారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 
 
వృషభం : విద్యుత్, ఏసీ కూలర్ మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తికానవస్తుంది. రావలసిన ధనం అందకపోవడంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. అతిథ మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా, ఉంటుంది. నరాలకు, ఎముకలకు సంబంధించిన చికాకులు తప్పవు. 
 
మిథునం : చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ప్రముఖుల సిఫార్సుతో మీ పనులు సానుకూలమవుతాయి. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వస్త్రం, వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. విద్యార్థులకు కొన్ని నిర్బంధాలకు లోనవుతారు. 
 
కర్కాటకం : వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమ అధికం. ఆదాయం స్వల్పం. మీ అభిప్రాయాలను సూచనప్రాయంగా తెలియజేయండి. ప్రింటింగ్ రంగాల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. బ్యాకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. వాహనం నడుపనపుడు మెళకువ అవసరం. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. 
 
సింహం : వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. దైవ, సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, బదిలీ ఉత్తర్వులు అందుతాయి. చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. 
 
కన్య : శారీరకశ్రమ, అకాల భోజనం వల్ల పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. అధికారుల ధనప్రలోభానికి దూరంగా ఉండాలి. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
తుల : ఆర్థిక, వ్యాపార విషయాలను గోప్యంగా ఉంచండి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. సలహాలు మీకు నాయకులకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. దపంతుల మధ్య చిన్న చిన్న కలహాలు, పట్టింపులెదురవుతాయి. 
 
వృశ్చికం : ఎండుమిర్చి, నూనె, బెల్లం, ఆవాలు, పసుపు, వ్యాపారస్తులకు లాభదాయకం. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. పాత రుణాలు తీరుస్తారు. కుటుంబీకుల కోసం ఎంతపాటుపడినా పెదవి విరుపులు, ఈసడింపులు తప్పవు. సమాచార లోపం వల్ల నిరుద్యోగులు ఒక అవకాశాన్ని జారవిడుచుకుంటారు. 
 
ధనస్సు : స్త్రీలకు కొత్త వ్యక్తులతో తక్కువగా సంభాషించడం మంచిది. విద్యార్థినుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అధిస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. 
 
మకరం : వైద్యులకు ఆపరేషన్లు చేయనపుడు జాగ్రత్త అవసరం. దంపతుల మధ్య దాపరికం మచిది కాదు. కాంట్రాక్టులు కుదుర్చుకుంటారు. స్త్రీలకు శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. దీర్ఘకాలంగా వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. 
 
కుంభం : ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. రాజకీయ కళా రంగాల వారికి కొంత అనుకూలిస్తుంది. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు. హోటల్, తినుబండారు వ్యాపారాలు లాభదాయకం. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యవసాయ రంగాల వారికి చికాకులు తప్పవు. 
 
మీనం : ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. రావలసిన ధనం అందకపోవడంతో ఒకింతి నిరుత్సాహం వంటివి తప్పవు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు వాయిదాపడవచ్చు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. సోదరీ, సోదరుల మధ్య ఆస్తి విషయాల గూర్చి తగాదాలు రావొచ్చు.