సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-06-2022 మంగళవారం రాశిఫలాలు ... ఆంజనేయస్వామిని ఆరాధించడం వల్ల...

Astrology
మేషం :- దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు అన్ని విధాలా కలిసిరాగలదు. ఒకానొక విషయంలో మీ కళత్ర మొండివైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. క్రయ విక్రయాలు ఆశించినంత సంతృప్తినీయజాలవు. ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది.
 
వృషభం :- పండ్లు, పూలు, కొబ్బరి, చల్లని పానియ, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి వంటివి ఎదుర్కొంటారు. విదేశీయాన యత్నాలు ముమ్మరం చేస్తారు. తరుచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఇతరుకు పెద్ద ఎత్తున ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం.
 
మిథునం :- ఆర్థికంగా మెరుగుపడతారు. భాగస్వామిక వ్యాపారాల్లో మీ ఆధిపత్యానికి భంగం కలుగవచ్చు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి తప్పదు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవటం మంచిది కాదు. నూతన వస్తువులు వాహనాలు కొంటారు.
 
కర్కాటకం :- పాడిపశువులు, పెంపుడు జంతువుల విషయంలో ఆందోళన చెందుతారు. విద్యార్థుల్లో కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ ఆలోచనలు, పథకాలు క్రియారూపంలో పెట్టండి. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆందోళనలు వంటివి తలెత్తుతాయి. ప్రతి విషయంలోను మీదే పైచేయిగా ఉంటుంది.
 
సింహం :- భాగస్వామిక వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు, అధికారులకు మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. క్రీడ, కళాకారులకు ప్రోత్సాహకరం. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి కర్తవ్య నిర్వహణలో చిన్న చిన్న పొరపాట్లు జరిగే ఆస్కారం ఉంది. సన్నిహితుల గురించి ఆందోళన చెందుతారు.
 
కన్య :- మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది, మెలకువ వహించండి. విద్యార్థులకు దూర ప్రాంతాల నుండి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. బంధువులను కలుసుకుంటారు.
 
తుల :- వ్యాపారాలు ఆశించినంత లాభసాటిగా ఉండవు. నిరుద్యోగులకు ఇంటర్యూలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహం వంటివి తలెత్తుతాయి. కుటుంబ అవసరాలు పెరగటంతో అదనపు సంపాదన కోసం యత్నాలు చేస్తారు. గతంలో వాయిదా వేసిన పనులు పును ప్రారంభిస్తారు.
 
వృశ్చికం :- ప్రియతముల నుంచి ఒక సమాచారం గ్రహిస్తారు. మీరు చేయబోయే మంచి పని విషయంలో అనుమానాలు విడనాడి శ్రమించండి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. ప్రేమికులు అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. మీ యత్నాలకు సన్నిహితుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.
 
ధనస్సు :- బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. రావలసిన ధనం అందటంతో కుదుటపడతారు. అనుకున్న పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. 
 
మకరం :- వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు సామాన్యం. స్త్రీలకు అయినవారితో పట్టింపులెదుర్కోవలసి వస్తుంది. పన్నులు, బీమా, బిల్లులు పరిష్కారం అవుతాయి. ప్రేమికులకు చికాకులు అధికమవుతాయి. రుణాలు, పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఆదాయ వ్యయాల్లో సమతుల్యత ఉంటుంది.
 
కుంభం :- ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ఉద్యోగస్తులు చిక్కుల్లో పడతారు. ప్రముఖుల కోసం ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపలు ఆందోళన కలిగిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు బంధువలు, చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
మీనం :- స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కిరాగలవు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు స్థానమార్పిడికై చేయు యత్నాలు వాయిదా పడతాయి.