మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ప్రతికూలతలు తొలగుతాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన లోపం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ అవసరం. ఇతరులను మీ ఇషయాలకు దూరంగా ఉంచండి. గృహమరమ్మతులు చేపడతారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు నిరుత్సాహరుస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
మీ కష్టం ఫలిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. ఆది, సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆప్తులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అనాలోచితంగా వ్యవహరించవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. యోగాపై ఆసక్తి పెంపొందుతుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. నిరుద్యోగులకు నిరాశాజనకం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏకపక్ష నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సన్నిహితుల సహాయం అందుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులను నమ్మవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతానం దూకుడు కట్టడి చేయండి. ఆరోగ్యం సంతృప్తికరం. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. వ్యవసాయ రంగాల వారికి కష్టకాలం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం.
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
గ్రహాల అనుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఆది, గురువారాల్లో ఆప్తుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. రిటైర్డు అధికారులకు ఆత్మీయు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. దూరాన ఉన్న ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. శుక్ర, శనివారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సన్నిహితులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్థిరాస్తి వ్యవహారంలో మెలకువ వహించండి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు తప్పకపోవచ్చు. ధార్మిక విషయాలపై దృష్టి పెడతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
అనుకూలతలు అంతంత మాత్రమే. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆశావహదృక్పథంతో వ్యవహరించండి. వ్యాపకాలు సృషించుకోవటం ఉత్తమం. ఆదివారం నాడు పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. కొంతమంది మీ ఆలోచనలను నీరుగారుస్తారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. ప్రయాణం విరమించుకుంటారు.
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
శ్రమాధిక్యత మినహా ఫలితం అంతంత మాత్రమే. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. సోమ, మంగళవారాల్లో కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. వాగ్వివాదాలకు దిగవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. దంపతుల మధ్య అవగాహన లోపం. ఇంటి విషయాలు పంచుకోండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆప్తులతో సంభాషిస్తారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. నూతన వ్యాపారాలు కలిసిరావు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు అధికారుల తీరు ఆందోళన కలిగిస్తుంది. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఉపాధి పథకాలు చేపడతారు. ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదము, అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు
సంతోషకరమైన వార్తలు వింటారు. మీ కష్టం వృధా కాదు. ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. పురస్కారాలు అందుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. బుధ, గురువారాల్లో పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలపడుతుంది. ప్రకటనలను విశ్వసించవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల
స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
అన్ని విధాలా అనుకూలదాయకమే. వాగ్దాటితో రాణిస్తారు. పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. గృహం సందడిగా ఉంటుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఆది, సోమవారాల్లో చేసిన పనులే చేయవలసి వస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. బిలర్లకు కష్టకాలం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ప్రతికూలతలు అధికం. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. మనశ్శాంతి ఉండదు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోండి. అతిగా ఆలోచింపవద్దు. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఖర్చులు అధికం. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్లు వదిలేయండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కార్మికులకు కొత్త పనులు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉపాధ్యాయులకు స్థానచలనం, ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు అప్పగించవద్దు. ఇంటి విషయాలు గోప్యంగా ఉంచండి. గృహ మరమ్మతులు చేపడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. వ్యవసాయ రంగాల వారికి నిరాశాజనకం. పాత పరిచయస్తులను కలుసుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
ఈ వారం కలిసివచ్చే సమయం. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు వేగవంతమవుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త, ఇతరుల జోక్యానికి తావివ్వద్దు. వ్యవహారాలు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. దంపతుల మధ్య దాపరికం తగదు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. గృహమార్పు అనివార్యం. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి. అధికారులకు హోదామార్పు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వాహనం ఇతరులకివ్వవద్దు.