1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

04-06-2022 శనివారం రాశిఫలాలు ... లలిత సహస్రనామం చదివినా....

astro6
మేషం :- కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. తలపెట్టిన పనులు మందకొడిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి సహకారంతో కొన్ని సమస్యలు సానుకూలమవుతాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
 
వృషభం :- వ్యవసాయ రంగంలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. మిత్రులతో కలసి విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. కళలు, క్రీడల వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. సోదరీ, సోదరులతో మెళకువ వహించండి. ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది.
 
మిథునం :- బంధు మిత్రులను కలుసుకుంటారు. ఖర్చులు ఇతర అవసరాలు పెరగటంతో రుణయత్నాలు తప్పవు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మీ మాటతీరు, పద్దతులను మార్చుకోవలసి ఉంటుంది. పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది.
 
కర్కాటకం :- వృత్తుల్లో వారికి సంతృప్తి, అభివృద్ధి కానవస్తుంది. తల పెట్టిన పనుల్లో కొంత ముందు మెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు. ప్రత్తి, పొగాకు, స్టాకిస్టులకు చికాకులను ఎదుర్కొంటారు. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఎంత కష్టమైనపనైనా అవలీలగా పూర్తిచేస్తారు.
 
సింహం :- ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలలో చికాకులు తప్పవు. స్త్రీలకు ఉపాథి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. నరాలకు, ఎముకలకు సంబంధించిన చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ప్రముఖులతో పరిచయాలు నూతన బంధుత్వాలు ఏర్పడతాయి.
 
కన్య :- కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్వయంకృషితో బాగుగా అభివృద్ధి చెందుతారు. స్త్రీలు అందరి యందు కలుపుగోలు తనంగా వ్యవహరించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
తుల :- కానివేళలో మిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలతో మితంగా సంభాషించండి. రాజకీయ నాయకులు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అదనపు సంపాదనకు మార్గాలు అన్వేషిస్తారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
వృశ్చికం :- ఆర్ధిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఒక యత్నం ఫలించటంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ప్రదేశ సందర్శనలు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రావలసిన ధనం కోసం శ్రమ, ప్రయాసలు ఎదుర్కోవలసి వస్తుంది.
 
ధనస్సు :- దంపతుల మధ్య సంతానం విద్యా విషయాలు ప్రస్తావనకు వస్తాయి. అసలైన శక్తి సామర్థ్యన్ని మిమ్మల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొంటారు. తలచిన కార్యక్రమాలు, వ్యవహారాలు సజావుగా సాగుతాయి.
 
మకరం :- ఆత్మీయుల రాక కుటుంబంలో ప్రాధ్యాన్యత సంతరించుకుంటుంది. ప్రేమికులకు కొత్త చిక్కులొచ్చిపడతాయి. స్త్రీలకు తల, కాళ్లు, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కానవస్తుంది. సభలు, సమావేశాలు, వేడుకల్లో చురుకుగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది.
 
మీనం :- ఆకస్మికంగా ప్రయాణాలలో చికాకులు తలెత్తుతాయి. ప్రేమికులకు మధ్య పెద్దల వల్ల సమస్యలు తలెత్తగలవు. పన్నులు, రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. బంధువుల సలహాలను పాటిస్తారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.