మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-06-2022 శుక్రవారం రాశిఫలాలు ... కామేశ్వరిదేవిని పూజిస్తే సర్వదా శుభం...

astro5
మేషం :- విద్యుత్, ఏసి. కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి పురోభివృద్ధి, సంతృప్తి కానవస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలను ఎదుర్కొంటారు.
 
వృషభం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలలోని వారికి యాజమాన్యం నుంచి ఒత్తిడి అధికమవుతుంది. రుణ, ఇతర వాయిదా చెల్లింపులు సకాలంలో జరుపుతారు. వాతావరణంలో మార్పు మీ పనులకు ఆటంకమవుతుంది. బంధువులతో ఏకీభవించలేకపోతారు.
 
మిథునం :- విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సిఫార్సుతో ఒకరికి చక్కని అవకాశం లభిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య సంబంధ భాంధవ్యాలు బాగా ఉంటాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, స్వశక్తిపై జీవించాలన్న పట్టుదల అధికమవుతాయి. పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోకండి.
 
కర్కాటకం :- ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రముఖులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
సింహం :- దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. టెక్నిక్, వైజ్ఞానిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిన్నపాటి ఆనారోగ్యానికిగురై చికిత్స తీసుకోవల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రతలోపం వల్ల అధికారులతో మాట పడక తప్పదు. గతంలో విడిపోయిన భార్యా, భర్తలు తిరిగినా కలిసే అవకాశం ఉంది.
 
కన్య :- ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. అధికారులతో మనస్పర్థలు తలెత్తుతాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనవ్యయం, శ్రమాధిక్యతతో వ్యవహారాలు సానుకూలమవుతాయి.
 
తుల :- రిప్రజెంటేటివ్‌లకు తమ టార్గెట్లను అతికష్టం మీద పూర్తి చేస్తారు. అప్పుడప్పుడు పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తగలవు. బంధు మిత్రులతో ప్రయాణాలు సాగిస్తారు. బృందా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీల వసూలు కొంత మేరకు వసూలు కాగలవు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం.
 
వృశ్చికం :- శ్రమాధిక్యత, అకాల భోజనం వంటి చికాకులు తప్పవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఆనవసరపు ఆలోచనలతో మనసు పాడుచేసుకోకుండా అందరితో సంతోషంగా మెలగండి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
 
ధనస్సు :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయ వంతంగా పూర్తి చేస్తారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తిని ఇస్తాయి. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. కానివేళలో ఇతరులరాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
మకరం :- ప్రతి చిన్న చిన్న విషయాలకు ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా మెలగవలసి ఉంటుంది. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. స్త్రీల తొందరపాటుతనం వల్ల బంధువర్గాల నుండి మాటపడవలసి వస్తుంది.
 
కుంభం :- చేయని పొరపాటుకు మాటపడవలసి వస్తుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సోదరుల మధ్య సఖ్యత అంతగా ఉండదు. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.
 
మీనం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఒకానొక సంర్భంలో మీ వివరణ ఇతరులకు సంతృప్తి కలిగించదు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీ హోదా చాటు కోవటానికి ధనం బాగా వ్యయం చేయవలసి వస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.