1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

06-06-2022 సోమవారం రాశిఫలాలు ... మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్పం...

astro8
మేషం :- ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వాతావరణంలోని మార్పు రైతులలో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవటంతో ఒకింత ఆందోళనతప్పదు.
 
వృషభం :- మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. వ్యవసాయ కూలీలకు, భవన కార్మికులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంఘంలో మంచి పేరు లభిస్తుంది. మీ ఉన్నతిని చాటుకోవటానికి ధనం విపరీతంగా వ్యయం చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు సత్ఫలితాలనిస్తాయి.
 
మిథునం :- ఉమ్మడి వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. వ్యాపార రీత్యా ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కోర్టు పనులు వాయిదా పడటం మంచిదని గమనించండి.
 
కర్కాటకం :- స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. పెద్దల ఆరోగ్యం సంతృప్తిని ఇస్తుంది. రిప్రజెంటేటివ్‌లకు, ఏజెంట్లకు, బ్రోకర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. 
 
సింహం :- కుటుంబ సభ్యుల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. భాగస్వామిక వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. అయినవారి రాక మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
 
కన్య :- ఉద్యోగస్తులకు పదోన్నతి, ఆర్థికపరమైన ప్రోత్సాహకరమైన వార్తలు వింటారు. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు.
 
తుల :- ఉపాధ్యాయులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. ఉమ్మడి వెంచర్లు, సంస్థల స్థాపనలో పునరాలోచన అవసరం. ముఖ్యులలో ఒకరి గురించి అప్రియమైన సమాచారం అందుతుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి పని భారం అధికం.
 
వృశ్చికం :- రాజకీయ నాయకులు విదేశాలను పర్యటిస్తారు. రావలసిన బకాయిలు ముందువెనుకలుగానైనా అందటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు.
 
ధనస్సు :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో చికాకులు, అధికారుల ఒత్తిడి అధికం. తొందరపాటుతనం వల్ల ప్రేమికులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
మకరం :- ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్యమైన ఫలితాలను ఇస్తుంది. రాజకీయనాయకులకు హడావుడి, తొందరపాటు తగదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి.
 
కుంభం :- వ్యాపారాభివృద్ధికి పలు ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. నూతన బాధ్యతలను అంగీకరించే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి.
 
మీనం :- వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో మంచి ఫలితాలుంటాయి. ఎదుటివారి వ్యాఖ్యలు మీపై తీవ్రంగా పనిచేస్తాయి. కార్యసాధనలో ఓర్పు, నేర్పు, పట్టుదల చాలా అవసరం. స్త్రీల మనోవాంఛలు నెరవేరటంతో కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.