ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-12-2024 ఆదివారం దినఫలితాలు - రుణ సమస్యలు తొలగిపోతాయి..

horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సమస్యలను నిబ్బరంగా ఎదుర్కుంటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఖర్చులు విపరీతం.పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆహ్వానం అందుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిచయస్తుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. అపోహలకు తావివ్వవద్దు. ధైర్యంగా ముందుకు సాగండి. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి.
 
మిథునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. మీ నమ్మకం, కృషి ఫలిస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి.
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు విపరీతం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు అర్థాంతంగా ముగిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పిల్లల దూకుడు అదుపు చేయండి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
రుణ సమస్యలు తొలగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. చేపట్టిన పనులు స్థిమితంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. కీలక చర్చల్లో పాల్గొంటారు. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. పనులు మందకొడిగా సాగుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. ధనసహాయం తగదు. ఆప్తులతో ఉత్సాహంగా గడుపుతారు. పనులు మందకొడిగా సాగుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. పాత పరిచయస్తులు తారసపడతారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. రోజువారి ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులకు సాయం అందిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ప్రత్యర్థులను ఓ కంట కనిపెట్టండి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.