ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 21 డిశెంబరు 2024 (22:36 IST)

Weekly Horoscope: 22-12-2024 నుంచి 28-12-2024 వరకు ఫలితాలు- మీ మాటలు చేరవేసే వ్యక్తులు?

Weekly Horoscope
Weekly Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహించండి. ఏ విషయంలోను రాజీపడద్దు. మీ నిర్ణయాలను కచ్చితంగా తెలియజేయండి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. శ్రమతో కూడిన విజయాలున్నాయి. చేపట్టిన పనులు ఆపివేయొద్దు. ఆది, సోమ వారాల్లో అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. దంపతుల మధ్య పరస్పర అవగాహన కుదురుతుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధువుల రాకతో గృహం సందడిగా ఉంటుంది. ఉద్యోగపరంగా సత్ఫలితాలున్నాయి. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఆరోగ్యం బాగుంటుంది. మీ పలుకుబడితో ఒకరికి సదవకాశం లభిస్తుంది. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనకు ఓర్పు, కృషి ప్రధానం. ఆశావహదృక్పధంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. మంగళవారం నాడు కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానానికి శుభపరిణామాలున్నాయి. ఆప్తులతో సంభాషిస్తారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం చేయవద్దు. మీ జాప్యం వల్ల మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. కొత్త వ్యాపారాలకు సమయం కాదు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ధృఢసంకలంతో అడుగు ముందుకేయండి. సలహాలు, సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. ఆదాయం అంతంత మాత్రమే. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. గురువారం నాడు కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. అందరితోను మితంగా సంభాషించండి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కీలక పత్రాలు అందుకుంటతారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి అభిప్రాయం తెలుసుకోండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. షాపు పనివారలతో చికాకులెదురవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారజయం, ధనలాభం ఉన్నాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వాల స్వీకరణకు తగిన సమయం. బాధ్యతగా మెలగాలి. కిట్టని వ్యక్తులతో జాగ్రత్త. అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బుధవారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం భవిషత్తుపై దృష్టి పెడతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. చెల్లింపుల్లో జాప్యం తగదు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేయొద్దు. సోమవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అందరితోను మితంగా సంభాషించండి. మీ మాటలు చేరవేసే వ్యక్తులున్నారని గమనించండి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మికత ఆసక్తి కనబరుస్తారు. వృత్తి ఉద్యోగ పరంగా మంచి ఫలితాలున్నాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తగిన సమయం. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సర్వత్రా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. నిర్దిష్ట ప్రణాళికలతో వ్యవహరిస్తారు. ఆప్తులు సహకరిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. గురు, శుక్ర వారాల్లో అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. స్థల వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ వారం అనుకూలదాయకం. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. లావాదేవీలు ప్రశాంతంగా ముగుస్తాయి. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. పనులు వేగవంతమవుతాయి. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంది. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. రిప్రజెంటేటివ్ లు లక్ష్యాలను సాధిస్తారు. బిల్డర్లకు లాభసాటి కాంట్రాక్టులు లభిస్తాయి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. తాకట్టు విడిపించుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. బంధుమిత్రులతో సంబంధాలు మరింత బలపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. సంతానానికి శుభపరిణామాలున్నాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయొద్దు. ఉద్యోగస్తులు మన్ననలు పొందుతారు. నిరుద్యోగులకు సదవకాశం లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారానుకూలత, ధనలాభం ఉన్నాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి. శనివారం నాడు పరిస్థితులకు తగ్గట్టుగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఒకరివద్ద మరొకరి ప్రస్తావన తగదు. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెట్టండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు.. సంతానానికి ఉద్యోగయోగం. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మధ్యతరహా వ్యాపారులకు బాగుంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రయాణంలో జాగ్రత్త వహించండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రణాళికాబద్ధంగా యత్నాలు సాగించండి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. గురువారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అవసరానికి అయిన వారు సాయం చేస్తారు. వస్త్ర, బంగారం వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధపెట్టండి. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు ఓర్పు ప్రధానం. ఉపాధి పథకాలు చేపడతారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. భేషజాలకు పోవద్దు. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. చేపట్టిన పనులు అర్థాంతంగా ముగిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. పెట్టుబడులు కలిసిరావు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఆందోళన, పనిభారం. క్రీడాపోటీల్లో విజయం సాధిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సర్వత్రా మీదే పైచేయి. ప్రతికూలతను అనుకూలంగా మలుచుకుంటారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. పలుకబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. సోమ, మంగళ వారాల్లో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిన్న వ్యాపారాలు ఊపందుకుంటాయి. మార్కెటింగ్ రంగాల వారు లక్ష్యాన్ని సాధిస్తారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు ఆదాయం బాగుంటుంది. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది.