బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వ్యవహారలావాదేవీలతో సతమతమవుతారు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు సామాన్యం. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు వాయిదా పడతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం. పట్టుదలకు పోవద్దు. సన్నిహితులను కలుసుకుంటారు. పొదుపు ధనం గ్రహిస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. పత్రాలు, వస్తువులు జాగ్రత్త. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలను అనుకూలతలుగా మలుచుకుంటారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు అధికం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. దైవదర్శనాలు ఉల్లాసాన్నిస్తాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు సామాన్యం. సంప్రదింపులు జరపుతారు. లావాదేవీల్లో ఒత్తిడికి గురి కావద్దు. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ఒక సమాచారం ఊరటనిస్తుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. మొండిగా కార్యక్రమాలు కొనసాగిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు. ఖర్చులు అధికం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. పాతపరిచయస్తులను కలుసుకుంటారు. వేడుకకు హాజరవుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. ఆదాయం ఫర్వాలేదు అనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. 
 
తుల : చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీరు చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ సమర్ధతపై ఎదుటి వారికి గురికుదురుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. రావలిసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. కొందరి మాటతీరు కష్టమనిపిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. వాహనదారులకు దూకుడు తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు విపరీతం. సభ్యత్వాలు స్వీకరిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. పనులు చురుకుగా సాగుతాయి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మాట నిలబెట్టుకుంటారు. ఖర్చులు అధికం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. దంపతుల మధ్య అకారణ కలహం.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనిభారం, విశ్రాంతి లోపం. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అధికం, రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. పనులు ఒక పట్టాన పూర్తి కావు. చీటికిమాటికి చికాకుపడతారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఉచితంగా ఏదీ ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. సన్నిహితులను కలుసుకుంటారు. ఖర్చులు అధికం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ప్రయాణం తలపెడతారు.