సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

27-02-2024 మంగళవారం మీ రాశిఫలాలు - లలిత సహస్రనామం చదివినా లేక విన్నా శుభం...

astrolgy
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ శు॥ తదియ రా.11.22 హస్త తె.5.20 ప.వ.12.08 ల 1.54. ఉ. దు. 8. 50 ల 9.35 రా.దు 10.57 ల 11.48.
లలిత సహస్రనామం చదివినా లేక విన్నా శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం :- స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ధనవ్యయం, రుణ సహాయానికి సంబంధించిన విషయాల్లో కుటుంబీకులను సంప్రదించటం మంచిది. నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. సన్నిహితులతో కలిసి దైవ, సేవాకార్యాలలో పాల్గొంటారు.
 
వృషభం :- మీ ప్రయాణాలు ఇతరుల కారణంగా వాయిదా పడటంతో నిరుత్సాహానికి లోనవుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు మీకెంతో సంతృప్తినిస్తాయి. వైజ్ఞానిక, శాస్త్ర విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన వ్యాపారాల్లో ఒకింత పురోగతి కనిపిస్తుంది. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో కొంత చికాకులు తప్పవు.
 
మిథునం :- బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. ఏ వ్యక్తికీ పూర్తిగా బాధ్యతలు అప్పగించడం మంచిది కాదని గమనించండి. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. దుబారా ఖర్చులు నివారించటం సాధ్యపడక పోవచ్చు. మీ సంతానం విద్య, వివాహ విషయాలపట్ల శ్రద్ధ కనపరుస్తారు.
 
కర్కాటకం :- వస్త్ర, స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అశాజనకం. స్త్రీలలో సంపాదన పట్ల ఆసక్తి మరింత బలపడుతుంది. రాబడికి మించిన ఖర్చులు వల్ల స్వల్ప ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. శారీరక శ్రమ, విశ్రాంతి లోపంవల్ల అస్వస్థతకు గురవుతారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.
 
సింహం :- ఉద్యోగస్తుల ప్రమోషను అధికారులు సిఫార్సు చేస్తారు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ప్రైవేటు సంస్థలలో మదుపు చేయటం మంచిది కాదని గమనించండి. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల ఇబ్బందులు తప్పవు. ఒక సమస్య పరిష్కారం కావటంతో కోర్టు వాజ్యాలు ఉపసంహరించుకుంటారు.
 
కన్య :- నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావలసివుంటుంది. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. కుటుంబీకుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. వ్యాపార లావాదేవీలు గోప్యంగా ఉంచడం మంచిది. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది. వాహనచోదకులకు చికాకులు అధికం.
 
తుల :- ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటంతో పాటు అనుభవం గడిస్తారు. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలు ఇతరులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. విద్యార్ధినులకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. కొన్ని అనుకోని సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తాయి.
 
వృశ్చికం :- బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్ధులకు ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. బంధువులను కలుసుకుంటారు.
 
ధనస్సు :- బంధుమిత్రుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఊహించని ఖర్చులు వల్ల చేబదుళ్ళు తప్పవు. విద్యార్థులకు ఏకాగ్రతా లోపం, మందకొడితనం వల్ల చికాకులు తప్పవు. పత్రిక, మీడియా సంస్థల వారు అకారణంగా మాటపడవలసి వస్తుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు.
 
మకరం :- గిట్టనివారికి హితవు చెప్పి భంగపాటుకు గురవుతారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. దంపతుల మధ్య అవగాహన కుదురుతుంది. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు అన్నివిధాలా కలిసిస్తుంది.
 
కుంభం :- గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. ఫ్లీడర్లకు ఒత్తిడి, అకౌంట్స్ రంగాలవారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల సమస్యలు తలెత్తుతాయి.
 
మీనం :- యాదృచ్ఛికంగా పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. సోదరులతో అవగాహన లోపిస్తుంది. గృహోపకరాణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీలకు షాపింగ్ విషయాలలో మెళుకువ అవసరం.