సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

26-02-2024 సోమవారం దినఫలాలు - మీ ఇష్టదైవాన్ని ఆరాధించినా సర్వదా పురోభివృద్ధి

Astrology
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ శు॥ విదియ రా.9.22 ఉత్తర రా.2.54 ఉ.వ.8.17 ల 10.03. ప.దు. 12.36 ల 1.21 పు.దు.2.52ల 3.37.
మీ ఇష్టదైవాన్ని ఆరాధించిన సర్వదా పురోభివృద్ధి కానవస్తుంది.
 
మేషం :- ప్రైవేటు విద్యా సంస్థలలోని ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికం. మీ పనులు మందకొడిగా సాగటం, జాప్యం వంటి చికాకులు ఎదుర్కొంటారు. కిరణా, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు ఆశాజనకం. మీ సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. మీ కళత్ర ఆర్యోగం మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది.
 
వృషభం :- కొబ్బరి, పండ్లు, పూలు, కూరల వ్యాపారులకు లాభదాయకం. కుటుంబీకులతో అవగాహన లోపిస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెళకువ వహించండి. స్థిరాస్తి, క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెళకువ అవసరం. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. 
 
మిథునం :- పాతమిత్రుల కలయికతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. బంధువులతో గృహంలో సందడి కానవస్తుంది. చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో నాణ్యత లోపం వల్ల నష్టాలు చవిచూడవలసి వస్తుంది. 
 
కర్కాటకం :- ఉద్యోగస్తుల బదిలీ యత్నాలకు కొంతమంది ఆటంకాలు కలిగిస్తారు. స్త్రీలకు చీటికిమాటికి అసహనం, నిరుత్సాహం వంటి చికాకులు తప్పవు. ఫ్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
సింహం :- మీడియా రంగాల వారు పనిభారం, ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబీకులతో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపంవల్ల మాటపడవలసి వస్తుంది. మీ దైందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. 
 
కన్య :- ఉపాధ్యాయులకు విద్యార్థుల పట్ల ఓర్పు, నేర్పు వ్యవహరించవలసివస్తుంది. వీసా, పాస్ పోర్టులకు సంబంధించిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. సన్నిహితుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. 
 
తుల :- రాజకీయాలలోని వారు ఆచి తూచి వ్యవహరించవలెను. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి ఆశాజనకం. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది. బంధు మిత్రుల రాకతో దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
వృశ్చికం :- బ్యాంకు పాత రుణాలు తీర్చుతారు. స్త్రీలకు తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులకు చదువులపట్ల ఏకాగ్రత అవసరం. కళలు, రాజకీయ, ప్రజాసంబంధాల రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
ధనస్సు :- ఖర్చులు అదుపు కాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. సభలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. స్త్రీలకు బంధువుల తాకిడివల్ల ఒత్తిడి, పనిభారం తప్పవు. మీ కళత్ర వైఖరి మీకు చికాకులను కలిగిస్తుంది. విదేశీ వస్తువులు పట్ల ఆసక్తి పెరుగుతుంది. పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
మకరం :- బంధు మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. సోదరీ, సోదరుల మధ్య అవగాహన కుదురుతుంది. రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదాపడుట వల్ల ఆందోళనకు గురవుతారు. ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు.
 
కుంభం :- నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. కార్యసాధననలో పట్టుదల, ఓర్పు చాలా ముఖ్యమని గమనించండి. ప్రేమికులకు పెద్దల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు.
 
మీనం :- బ్యాంకు వ్యవహారాలలోని పనులు చురుకుగా సాగుతాయి. ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధద్రవ్య వ్యాపారులకు శుభదాయకం. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు.