శనివారం, 4 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

30-11-2022 బుధవారం దినఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినా..

Astrology
మేషం :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకువేస్తారు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ వహించండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. శస్త్రచికిత్స చేయునపుడు వైద్యులకు మెళుకువ అవసరం.
 
వృషభం :- వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి వాతావరణంలో మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు అనవసర ప్రసంగాలు అపార్థాలకు దారితీస్తాయి. క్రయ విక్రయ రంగాలపట్ల ఏకాగ్రత వహిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి అనుకూలమైన కాలం.
 
మిథునం :- వాహన యోగం, కుటుంబ సౌఖ్యం పొందుతారు. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వ్యాపారా లావాదేవీలు ప్రోత్సహకరంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్న తరహా పరిశ్రమల్లో వారికి పురోభివృద్ధి కానరాగలదు. ఇతరులకు సలహా ఇవ్వటం వల్ల మాటపడవలసివస్తుంది.
 
కర్కాటకం :- కొబ్బరి, పండ్ల, పూల, పానీయ, చిరు వ్యాపారులకు శుభదాయకం. ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు ఆత్మనిగ్రహం చాలా అవసరం. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. కొంతమంది మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగేలా వ్యవహరిస్తారు.
 
సింహం :- విద్యార్ధులకు మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. స్త్రీలకు ఇరుగు పొరుగువారితో సఖ్యత అంతగా ఉండదు. నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను సమకూర్చుకుంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.
 
కన్య :- భాగస్వామ్యుల మధ్య ఆసక్తి కరమైన విషయాలు చర్చకు రాగలవు. పెద్దల ఆరోగ్యవిషయంలో మెళుకువ అవసరం. రిప్రజెంటిటివ్‌లకు, ఉపాధ్యాయులకు సదావకాశాలు లభించగలవు. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులు కలిగిస్తాయి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి మిశ్రమ ఫలితం.
 
తుల :- ఆస్థి విషయంలో సోదరుల నుంచి ప్రతికూలతలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ పట్టుదల వల్ల శ్రమాధిక్యత, ధననష్టం ఎదుర్కుంటారు. స్త్రీలకు దైవ, పుణ్య కార్యాలపట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. మిత్రుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు వింటారు. పెద్దల సహకారం లోపిస్తుంది.
 
వృశ్చికం :- గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. క్రీడ, కళ, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి పెరగగలదు. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. నూనె, మిర్చి, కంది వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు ఏ చిన్న అవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది.
 
ధనస్సు :- సినిమా, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు, లేదా అమ్మకానికై చేయు ప్రయాత్నాలు వాయిదా పడతాయి. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రముఖుల కలయిక వల్ల మీ సమస్యలు పరిష్కార మార్గంలోనడుస్తాయి. రియల్ఎస్టేట్ రంగాల్లో వారికి మాటపడక తప్పదు.
 
మకరం :- ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే గాని పపనులు పూర్తికావు. నిరుద్యోగులకు సదవకాశాలు లభించిన తొందరపాటుతనంతో జార విడుచుకుంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు కలిసివస్తాయి. వ్యాపార లావాదేవీల్లో స్వల్ప ఆటుపోట్లు, చికాకులు తప్పవు. మీ శ్రీమతి ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసివస్తుంది.
 
కుంభం :- హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల ఇబ్బందులెదుర్కుంటారు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహం లభిస్తుంది. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం మంచిది కాదు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ంగాల వారికి సామాన్యం. ఇతరులను సాయం చేసి ఆదుకోవాలనే తలంపుతో చిక్కులు కొనితెచ్చుకునేప్రమాదం ఉంది.
 
మీనం :- రుణయత్నాల్లో ఆటంకాలు ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు అధికం. స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలీయమవుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. వస్త్ర, బంగారం, పచారీ, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది.