ఆదివారం, 5 ఫిబ్రవరి 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

29-11-2022 మంగళవారం దినఫలాలు - కార్తీకేయుడిని పూజించినా...

Weekly astrology
మేషం :- బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు అధికం. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహ పరుస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు.
 
వృషభం :- వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం. అకారణంగా మాటపడవలసి వస్తుంది. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ఒక నష్టం మరో విధంగా భర్తీ కాగలదు. దూర ప్రయాణాలలో పరిచయాలు, వ్యాపకాలు బలపడతాయి.
 
మిథునం :- ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. దైవదర్శనంలో ఒకింత ఇబ్బందులెదర్కుంటారు. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ప్రయాణాలలో పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి.
 
కర్కాటకం :- ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. పాత రుణాలు తీర్చుతారు. శాస్త్ర, సాంకేతిక, మెడికల్ రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధి. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. స్త్రీలకు సంఘంలోను, బంధువులలోను ఆదరణ, గుర్తింపు లభిస్తాయి. 
 
సింహం :- ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. సోదరీసోదరులతో ఒక అవగాహనకు వస్తారు. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులు అప్రమత్తంగా ఉండాలి. ఎదుటివారి తీరుకు అనుగుణంగా మెలగండి. వాణిజ్య ఒప్పందాలు, స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి.
 
కన్య :- ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. సమయానికి కావలసిన వస్తువులు, పత్రాలు కనిపించకపోయే ఆస్కారం ఉంది. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం వీడండి. వస్త్ర, బంగారం, ఎలక్ట్రానికల్ వస్తు వ్యాపారాలకు పురోభివృద్ధి. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
తుల :- భాగస్వామిక చర్చలలో మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు, తోటివారి ప్రశంసలు లభిస్తాయి. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు, పనివారలకు చికాకులు, పనిభారం తప్పవు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. చిన్నానాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
 
వృశ్చికం :- సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసి ఉంటుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గుర్తుంచుకోవాలి. విందులు, వినోదాలలో అతిగా వ్యవహరించటం వల్ల భంగపాటుకు గురికాకతప్పదు.
 
ధనస్సు :- ఎల్.ఐ.సి, పోస్టల్, ఇతర ఏజెంట్లకు, బ్రోకర్లకు ఆశాజనకం. సిమెంటు, కలప, ఐరన్,ఇసుక వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. విద్యార్ధులకు క్రీడలు, వినోదాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు.
 
మకరం :- ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా చికాకులు తప్పవు. వృత్తులు, చిరు వ్యాపారులకు సంతృప్తి, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. ఆత్మీయులకు ఒక ముఖ్య సమాచారం అందించట వల్ల మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం.
 
కుంభం :- బంధు మిత్రులను కలుసుకుంటారు. భాగస్వామికంగా కంటే సొంత వ్యాపారాలే మీకు అనుకూలిస్తాయి. విందులు, వినోదాలలో అతిగా వ్యవహరించటం వల్ల మాటపడక తప్పదు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు, రాత పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
 
మీనం :- స్త్రీల రచనలు, వ్యాసాలు, చేతివృత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశాయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. గృహంలో మార్పులు అనుకూలిస్తాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి నిరంతర శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం.