గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

27-11-2022 ఆదివారం రాశిఫలాలు- ఆదిత్యుని మంకెన పూలతో?

Astrology
ఆదిత్యుని మంకెన పూలతో పూజించిన సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం:- ఆభరణాలు, విలువైన వస్తువుల కొనుగోలు రశీదులను జాగ్రత్తగా ఉంచుకోవటం క్షేమదాయకం. చేపట్టిన పనుల్లో అవాంతరాలు, చికాకులు ఎదుర్కుంటారు. వ్యాపార లావాదేవీలు, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ ఆలోచనలు గోప్యంగా ఉంచి ఎదుటివారి ఆంతర్యం గ్రహించేందుకు యత్నించండి.
 
 
వృషభం :- సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం చేయవలసివస్తుంది. గృహంలో ఒక శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తవుతుంది. స్త్రీలకు ఉపవాసాలు, దైవపూజలు సంతృప్తినస్తాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
 
 
మిథునం:- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఆత్మవిశ్వసం రెట్టింపవుతుంది. స్త్రీలు ఉపవాసాలు, దైవ కార్యాల్లో పాల్గొంటారు. కార్యసాధనలో జయం, మనశ్శాంతి పొందుతారు. ఖర్చులు పెరిగినా ఆదాయానికి లోటుండదు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. మంచి గుర్తింపు లభిస్తుంది.
 
 
కర్కాటకం:- వాణిజ్య ఒప్పందాలు, చెక్కుల జారీలో ఏకాగ్రత వహించండి. స్టాక్ మార్కెట్ రంగాలవారికి మిశ్రమ ఫలితం. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆస్తి పంపకాల సమస్యకు చక్కని పరిష్కారం గోచరిస్తుంది. ఆత్మీయుల నడుమ విలువైన కానుకలిచ్చిపుచ్చుకుంటారు.
 
 
సింహం:- ఉపాధ్యాయులు విశ్రాంతి కై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. మీ సంతానం ఉద్యోగం, వివాహ యత్నాలు ఫలిస్తాయి. ప్రేమికులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారంఉంది. ట్రాన్సుపోర్టు, ఆటోమోబెల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
 
కన్య:- భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. వాహన చోదకులకు చికాకులు తప్పవు. వ్యవహర ఒప్పందాలకు అనుకూలం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. వృత్తుల వారికి ఆశాజనకం. ఉపాధిపథకాల్లో నిలదొక్కుకుంటారు.
 
 
తుల:- ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఏజెన్సీలు, టెండర్లు, లీజు పొడిగింపులకు అనుకూలం. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు.
 
 
వృశ్చికం:- బంధువులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్కు అనుగుణంగానే ఉంటాయి. క్యాటరింగ్ కాంట్రాక్టర్లకు పనివారలతో చికాకులు అధికం. ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ, అనాలోచితంగా మాట ఇవ్వటం మంచిది కాదు. దంపతుల మధ్య దాపరికం అనర్థాలకు దారితీస్తుంది.
 
 
ధనస్సు:- ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారం, అదనపు బాధ్యతలతో క్షణం తీరిక ఉండదు. మొండి బాకీలవసూలులో సంయమనం పాటించండి. ప్రముఖులను కలుసుకుంటారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో అభ్యంతరాలెదుర్కోవలసివస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
 
మకరం:- వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలనిస్తాయి. మీ సంతానం ప్రేమ వ్యవహారం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు ఆత్మీయులు, అయిన వారిని చూడాలనే కోరిక పడుతుంది.ప్రయత్న పూర్వకంగా మొండి బాకీలు వసూలు కాగలవు. మీపై సెంటిమెంట్లు, ఇతరుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావంచూపుతాయి.
 
 
కుంభం:- ఆర్థికస్థితి సంతృప్తికరం. వేడుకలు, విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. సంతానం అత్యుత్యాహం ఇబ్బంది కలిగిస్తుంది. కొంతమంది మీ నుండి ధనసహాయం కోరవచ్చు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలులాభసాటిగా సాగుతాయి. కీలక సమావేశాలు, సభల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
 
 
మీనం:- ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ఎటువంటి సమస్యనైనా ధీటుగా ఎదుర్కుంటారు. గత సంఘటనలు గుర్తుకొస్తాయి. సంతానం కోసం బాగా వ్యయం చేస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ద్విచక్ర వాహన చోదకులకు చికాకులెదురవుతాయి.