22-11-2020 నుంచి 28-11-2020 వరకు మీ వార రాశి ఫలితాలు- video

Rashi Phalalu
రామన్| Last Modified శనివారం, 21 నవంబరు 2020 (22:13 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలు తొలగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సన్నిహితుల సలహా పాటిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పత్రాలు నగదు జాగ్రత్త. సోమ, మంగళ వారాల్లో ఒత్తిడి శ్రమ అధికం. గృహంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అనవసర జోక్యం తగదు. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వేడుకలకు హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది.

వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోగిణి, మృగశిర 1, 2 పాదాలు
అన్ని రంగాల వారికి శుభదాయకమే. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ధన లాభం కుటుంబ సౌఖ్యం పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు బలపడుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుది. బుధవారం నాడు సంప్రదింపులతో తీరిక ఉండదు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. మార్కెట్ రంగాల వారిక ఒత్తిడి అధికం. ద్విచక్ర వాహనాల చోదకులకు దూకుడు తగదు.

మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
బంధుమిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు సామాన్యం. గురు, శుక్ర వారాల్లో ధన సహాయం తగదు. ఆహ్వానం అందుతుంది. పనులు సానుకూలమవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థుల తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోండి. సంతానం విషయాల్లో శుభఫలితాలున్నాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణం వాయిదా పడుతుంది.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారానూలత ఉంది. అంచనాలు ఫలిస్తాయి. ప్రణాళిక రూపొందించుకుంటారు. కలిసి వచ్చిన అవకాశాలు వదులుకోవద్దు. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. శని, ఆది వారాల్లో పనుల్లో ఒత్తిడి అధికం. దంపతల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆందోళన తొలగి కుదుటపడుతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వేడుకల్లో పాల్గొంటారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. పాత పరిచయస్తులు తారసపడుతారు. వ్యాపారాల్లో ఆటంకాలు దీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయం సంతృప్తికరం. పొదుపు ధనం అందుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు ఏజెన్సీలను నమ్మవద్దు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మంగళ, బుధ వారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయినవారితో ఉల్లాసంగా గడుపుతారు. పత్రాలు అందుకుంటారు. గృహ మరమ్మతులు చేపడుతారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. విద్యా సంస్థలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

కన్య: ఉత్తర 2, 3 ,4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. గురువారం నాడు బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానం చదువులపై శ్రద్ద అవసరం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపు పని వారలతో జాగ్రత్త. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, ప్రోత్సాహక బహుమతులు అందుకుంటారు. వృత్తి, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. బెట్టింగులు, జూదాలకు పాల్పడవద్దు.

తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కష్టం ఫలిస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబ సౌఖ్యం వాహన యోగం పొందుతారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. గృహ మరమ్మతులు చేపడుతారు. ఆధ్యాత్మికతపై ఆసక్తి నెలకొంటుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు కొత్త బాధ్యతలు, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. వేడుకలు దైవ కార్యంలో పాల్గొంటారు.

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
ఈ వారం అప్రమత్తంగా ఉండాలి. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. పట్టుదలతో వ్యవహరించండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. అనవసర జోక్యం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు ప్రోత్సాకరంగా సాగుతాయి. సరకు నిల్వలో జాగ్రత్త. కాంట్రాక్టులు చేజారిపోతాయి. ఏజెంట్లు, రిప్రెజెంటేటివ్‌లకు ఒత్తిడి అధికం. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోండి.

ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారానుకూలత అంతంతమాత్రమే. శ్రమ అధికం. ఫలితం శూన్యం. ఆశావహ దృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. త్వరలో శుభవార్తలు వింటారు. ఖర్చులు సామాన్యం. అవసరాలకు ధనం అందుతుంది. ఆది, సోమ వారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అవివాహితులకు నిరుత్సాహకరం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తుల కష్టం ఫలిస్తుంది. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. వేడుకల్లో పాల్గొంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.

మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయ వ్యయాలు సతృప్తికరం. ప్రణాళిక రూపొందించుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. మగళ, బుధ వారాల్లో ఊహించని సంఘటనలు జరుగుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆత్మీయుల సలహా పాటించండి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానం ద్వారా శుభవార్తలు వంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. నోటీసులు అందుకుంటారు. చేతివృత్తులు, కార్మికులకు సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. మార్కెట్ రంగాల వారికి సామాన్యం. షేర్ల క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ పథకాలు మునుముందుకు సత్ఫలితాలిస్తాయి. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. గురు, శుక్ర వారాల్లో ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగా గ్రహిస్తారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పత్రాలు అందుకుంటారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనివారల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. వ్యాపారాల ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. కాంట్రాక్టులు ఏజెన్సీలను దక్కింటుకుంటారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వేడుకల్లో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.

మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రతికూలతలు అధికం. చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆత్మీయుల హితవు మీపై సత్ర్పభావం చూపుతుంది. ఖర్చులు సామాన్యం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. శని, ఆది వారాల్లో లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించిన భంగపాటుకు గురవుతారు. అయిన వారు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ద అవసరం. పరిచయం లేని వారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు.



దీనిపై మరింత చదవండి :