మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : సోమవారం, 2 నవంబరు 2020 (20:37 IST)

01-11-2020 నుంచి 07-11-2020 వరకు మీ వార రాశి ఫలాలు- video

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. శుభ కార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. బుధవారం నాడు పనుల్లో ఒత్తిడి. చికాకులు అధికం. గృహ మార్పు అనుకూలిస్తుంది. సంతానం, చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. పరిచయాలు బలపడుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అదికారులకు హోదా మార్పు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కార్మికులకు కష్టకాలం.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గుట్టుగా వ్యవహరించండి. బాధ్యతలు అధికమవుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సంబంధ బాంధవ్యాలు విస్తరిస్తాయి. నిలిపివేసిన పనులు పునః ప్రారంభిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సస్థల్లో మదుపు క్షేమం కాదు. ప్రకటనలు, సందేశాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. గరు, శుక్ర వారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వార్తలు వింటారు. కృషి ఫలిస్తుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ధన లాభం, కుటుంబ సౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. వ్యవహారాలు మీ చేతులు మీదుగా సాగుగుతాయి. శనివారం నాడు బ్యాంకు పనుల్లో ఒత్తిడి అధికం. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభి ప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. మీ శ్రీమతి విషయంలో శుభం జరుగుతుంది. గృహ నిర్మాణాలు మరమ్మతులు చురుకుగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిన్న వ్యాపారులకు సామాన్యం. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వాగ్దాటితో రాణిస్తారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ధనలాభం ఉంది. కొన్ని సమస్యల నుంచి బయటపడుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆది, సోమ వారాల్లో ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. బాధ్యతలు అప్పగించండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పిల్లల చదువులపై మరింత శ్రద్ద అవసరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడుతారు. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు సానుకూలమవుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మంగళ, బుధ వారాల్లో అనవవసర జోక్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ అవకాశం లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపు పనివారలతో జాగ్రత్త. వేడుకలకు హాజరవుతారు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యం సిద్దిస్తుంది. సానుకూల నిర్ణయం తీసుకుంటారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు సామాన్యం. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. కుటుంబీకులతో సఖ్యత నెలకొంటుంది. గురు, ఆది వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. వాస్తుకు అనుగుణంగా గృహ మరమ్మతులు చేపడుతారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపుచేయండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థల మార్పు అనివార్యం. కార్మికులకు సదావకాశాలు లభిస్తాయి. పుణ్య కార్యంలో పాల్గొంటారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. శుక్ర, శని వారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. మీ జోక్యం ఒక సమస్య సానుకూలమవుతుమంది. సంతానం, ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం. ఉమ్మడి వ్యాపారాలు, వ్యాపారాల విస్తరణకు అనుకూలం. వృత్తులు, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దూర ప్రయాణం తలపెడతారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు రూపొందించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. బుధవారం నాడు అనవసర జోక్యం తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. అయినవారితో ఉల్లాసంగా గడుపుతారు. నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. మీ ప్రమేయంతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత. సమయపాలన ప్రధానం. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. సరకు నిల్వలో జాగ్రత్త. ఆత్మీయుల క్షేమం తెలుసకుంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యానుకూలత ఉంది. మీ కష్టం వృధా కాదు. సమర్థతను చాటుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ధన లాభం ఉంది. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఒక స మాచారం ఆలోచింపజేస్తుంది. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. దంపతుల మధ్య సఖ్యత నెల కొంటుంది. బాధ్యతలు అప్పగంచవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య పరిష్కారమవుతుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతను అదుపులో ఉంచుకోండి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలసివస్తాయి. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి.ఆధ్యాత్మికత పెంపొందుతుంది.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ వారం ఆశాజనకమే. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనుల్లో త్తిడి, శ్రమ అధికం. సంతానం, ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. పత్రాలు విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత. అకాలభోజనం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పనులు చురుకుగా సాగుతాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. గురు, శుక్ర వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. గృహ మార్పు అనివార్యం. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాన్నిస్తాయి. చిన్న వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు శుభయోగం. పురస్కారాలు అందుకుంటారు. విద్యా సంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలేర్ప డుతాయి.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ ఓర్పునకు పరీక్షా సమయం. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. శని, ఆది వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభ కార్యానికి సన్నాహాలు సాగిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. సంతానం, భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు హోదా మార్పు, స్థాన చలనం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. ద్విచక్ర వాహన చోదకులకు దూకుడు తగదు.