సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (20:56 IST)

01-11-2020 నుంచి 30-11-2020 వరకు మీ మాస రాశి ఫలాలు

మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. అనుకున్నది సాధిస్తారు. పదవులు స్వీకరణకు అనుకూలం. పరిచయాలు బలపడుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు.పెట్టుబడులు కలిసిరావు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. కార్మికులకు కష్ట కాలం.
 
వృషభ రాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
అన్ని రంగాల వారికి ఆశాజనకమే. పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు మీ చేతులు మీదుగా సాగుతాయి. ఇరువర్గాలకు మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కుటుంబ సౌఖ్య ధన లాభం పొందుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
 
మిధున రాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు మీ చేతులు మీదుగా సాగుతాయి. ధన లాభం ఉంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం అనుకూలిస్తుంది. పరిచయాలు బలపడుతాయి. ఖర్చులు విపరీతం. ధనం చేతిలో నిలువదు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పెట్టుబడులకు అనుకూలం. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఆహ్వాన పత్రాలు అందుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
కర్కాటక రాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ మాసం శుభదాయకం. కష్టం ఫలిస్తుంది. మంచి పనులు చేసి ప్రశంసలు అందుకుంటారు. గృహం సందడిగా ఉంటుంది. ఆదాయ  వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. అయినవారితో ఉల్లాసంగా గడుపుతారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. నిర్మాణాలు మరమ్మతులు ఊపందుకుంటాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కార్మికులు, చేతి వృత్తుల వారికి ఆశాజనకం. వేడుకల్లో పాల్గొంటారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సర్వత్రా అనుకూలతలున్నాయి. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు తక్షణం వినియోగించుకోండి. సలహాలు సహాయం ఆశించవద్దు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులను అధికారులను ఆకట్టుకుంటారు. న్యాయ, సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. జూదాల జోలికి పోవద్దు.
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. సంతృప్తి కరం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్ద మొత్తం ధనసహాయం తగదు. బంధువులతో స్పర్థలు తలెత్తుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. గృహ మరమ్మతులు చేపడపుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. కార్మికులకు సదావకాశాలు లభిస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం యోగదాయకమే. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా కుదుట పడుతారు. గృహంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. పరిచయాలు, బంధుత్వాలు జాగ్రత్త. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం దూకుడు అదుపుచేయండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. జూదాలు, పందేలు జోలికి పోవద్దు.
 
 



 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్టవ్యవహారానుకూలత ఉండదు. ఆలోచనలతో సతమవుతారు. అప్రమతతంగా మెలగాలి. సన్నిహితుల సలహా పాటించండి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానం విషయాలలో శుభ ఫలితాలున్నాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఉద్యోగస్తులకు పదవీ యోగం. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. ప్రముఖులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
 
ధనుర్ రాశి: మూల,పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ మాసం అన్నిరంగాల వారికి శుభదాయకమే. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ధన లాభం ఉంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పెట్టుబడులు కలిసివస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుత్వాలు బలపడుతాయి. మీ జోక్యం అనివార్యం. ఇరువర్గాలవారు మీ సలహా పాటిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. గృహ మార్పు కలిసివస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉపాధి పథకాల్లో రాణింపు. అనుభవం గడిస్తారు. వ్యాపారాభివృద్ధికి తీవ్రంగా శ్రమిస్తారు. మీ పథకాలు సత్పలితాలిస్తాయి. కార్మికులు, చేతి వృత్తుల వారికి ఆశాజనకం. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. వాహనం ఇతరులకివ్వద్దు.
 
మకర రాశి: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసిద్ది, ధనలాభం ఉన్నాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా వ్యవహరించాలి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పెట్టుబడులు పొదుపు పథకాలు లాభిస్తాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధుత్వాలు పరిచయాలు విస్తరిస్తాయి. గృహం సందడిగా ఉంటుంది. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. అతిగా శ్రమించవద్దు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఒక సమాచారం ఆలోజింపజేస్తుంది. న్యాయ, సేవ, ఆరోగ్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారా భివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్ద మొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు ఒత్తిడి. పనిభారం. వేడుకలు వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. అయినవారితో ఉల్లాసంగా గడుపుతారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
మీనరాశి: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కొన్ని సమస్యల నుంచి బయటపడుతారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంప్రదింపులకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల సలహా పాటించండి. వాస్తుకు అనుగుణంగా గృహ మరమ్మతులు చేపడుతారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. సంతానం అత్యుత్సాహం అదుపుచేయండి. వ్యాపారాల్లో రాణింపు. అనుభవం గడిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి. పనిభారం. విద్యాసంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి.