శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Modified: శనివారం, 24 అక్టోబరు 2020 (21:59 IST)

25-10-2020 నుంచి 31-10-2020 వరకు మీ వార రాశి ఫలాలు- video

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఆత్మీయులను విందుకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు సంతృప్తికరం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆది, సోమ వారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శుభ కార్యానికి తీవ్రంగా సన్నాహాలు సాగిస్తారు. ఆది, సోమ వారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. వినోదాలు, వేడుకల్లో అత్యు త్సాహం తగదు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉత్సాహంగా గడుపుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మంగళ, బుధ వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. గుట్టుగా యత్నాలు సాగించండి. ప్రత్యర్థులతో జాగ్రత్త. సంతానం విషయంలో శుభ ఫలితాలు న్నాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. దైవ దర్శనంలో అవస్థలు తప్పవు. వాహనం ఇతరులకిచ్చి అవస్థలు పడతారు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పదవులు అందుకుంటారు. బాధ్యతలు అధికమవుతాయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. తొందరపడి హామీలివ్వద్దు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గురు, ఆది వారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఇరువర్గాల వారికి ఆమోదయోగ్యమవుతుమంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ధన లాభం. అధికారులకు హోదా మార్పు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం పుష్యమి, ఆశ్లేష
కలిసివచ్చే కాలం నడుస్తోంది. ఆలోచనలు కార్యరూపంలో పెట్టండి. స్వయంకృషితోనే రాణిస్తారు. సన్నిహితుల సాయం అందుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. శుక్ర, శని వారాల్లో అపరిచితులతో జాగ్రత్త. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ద వహించండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు ముందుకు సాగవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పెద్దల సలహా పాటిస్తారు. ఆశావహ దృక్పథంతో మెలగండి. త్వరలో పరిస్థితులు మెరుగుపడుతాయి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. అవసరాలు నెరవేరుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆదివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. ఇంటి విషయాలపై శ్రద్ద వహించండి. సన్నిహితులను కలుసుకుంటారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులు అనుకూలించవు. బెట్టింగులు, జూదాలకు పాల్పడవద్దు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. బంధుత్వాలు బలపడుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. పనులు వేగవంతమవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. సోమ, మంగళ వారాల్లో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. సంతానం విజయం ఉత్సాహానిస్తుంది. కీలక పత్రాల అందుకుంటారు. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ప్రశాంతత, విశ్రాంతి లభిస్తాయి. వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ వారం ఆశాజనకం. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు విపరీతం. సమయానికి ధనం సర్దుబాటవుతుంది. వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పనులు వేగవంతమవుతాయి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం అందించండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. వ్యాపారాలు ప్రాత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సముచిత నిర్ణ యాలు తీసుకుంటారు. కొంత మొత్తం ధనం అందుతుంది. మానసికంగా కుదుటపడుతారు. ఖర్చులు విపరీతం. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల ఇంటర్వూ అనుకూలించదు. సంతానం కదలికపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. శుభ కార్యానికి సన్నహాలు సాగిస్తారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. హోల్ సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. దైవ దర్శనాలు ఉల్లాసం కలిగిస్తాయి. వేడుకలకు హాజరవుతారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. వాగ్వాదాలకు దిగవద్దు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. చెల్లింపుల్లో జాగ్రత్త. బుధవారం నాడు పనుల్లో అవాంతరాలెదురవుతాయి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉద్యోగస్తులకు ధనయోగం. విందుల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు మనశ్శాంతినిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రణాళికలు రూపొందించుకుంటారు. బంధువులతో సంబధాలు బలపడుతాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. అనాలోచిత నిర్ణయాలు తగవు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. ఆశావహ దృక్పథంతో మెలగండి. గురు, శుక్ర వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలువదు. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. పిల్లల మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంతో మెలగాలి. పంతాలు, పట్టుదలకు పోవద్దు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. విద్యాసంస్థలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మీ జోక్యం అనివార్యం. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. రావలసిన ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు బలపడుతాయి. శని, ఆది వారాల్లో నగదు, పత్రాలు జాగ్రత్త. ఇంటి పనివారల నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. ఆరోగ్యం సంతృప్తికరం. ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. నగదు, బహుమతి, ప్రశంసలు అందుకుంటారు. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండడానికి యత్నించండి. అతిగా ఆలోచించవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవడం ఉత్తమం. ఆత్మీయుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. కుటుంబీకులు మీ ఆసక్తతను అర్థం చేసుకుంటారు. ఖర్చులు సామాన్యం, అవసరాలు నెరవేరుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. సోమ, మంగళ వారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పిల్లల చదువులపై శ్రద్ద వహించండి. గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. వాహనం ఇతరులకివ్వటం క్షేమం కాదు.