గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Modified: శనివారం, 17 అక్టోబరు 2020 (19:33 IST)

18-10-2020 నుంచి 24-10-2020 వరకు మీ వార రాశి ఫలాలు -video

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ప్రతికూలత అధికం. చీటికిమాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. అకారణంగా మాటపడవలసి వస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలువదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. బుధవారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శుభ కార్యానికి యత్నాల సాగిస్తారు. మధ్యవర్తులు, ఏజెన్సీలను విశ్వసించవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ప్రియతములను గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. మీ పథకాలు ఏమంత ఫలితమీయవు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుమంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
బంధుత్వాలు బలపడుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. గురు, శుక్ర వారాల్లో అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగస్తులకు ధనయోగం. అధికారులకు పనిభారం. విశ్రాంతి లోపం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. దైవ దర్శనంలో ఒకింత అవస్థలు తప్పవు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. అర్ధాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సంతానం విషయంలో శుభ పరిణామాలున్నాయి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. శని, ఆది వారాల్లో ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. గృహ మరమ్మతులు చేపడుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. విద్యా సంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ వారం యోగదాయకమే. మాట తీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. జటిలమైన వ్యవహారాలు సైతం కొలిక్కి వస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది. సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. మీ శ్రీమతి సలహా పాటించి లబ్ధి పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారం లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. దైవ దర్శనాలు ఉల్లాసానిస్తాయి.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఓర్పుతో వ్యవహరించాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటం ముఖ్యం. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. గృహ మార్పు అనివార్యం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. న్యాయ, సేవ, సాంకేతిక రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. షేర్ల క్రయ విక్రయాలు నిరుత్సాహ పరుస్తాయి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కార్యదీక్ష ఎదుటివారిని ఆకట్టుకుంటుంది. అవకాశాలు తక్షణం వినియోగించుకోండి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. సోమ, మంగళ వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పరిచయస్తులకు ధన సహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. గృహ మార్పు కలిసివస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. సంతానం చదువులపై మరింత శ్రద్ద అవసరం. విద్యాసంస్థలకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. వృత్తుల వారికి ఆశాజనకం. దైవ దర్శనంలో అవస్థలు ఎదుర్కొంటారు. వాహన చోదకులకు దూకుడు తగదు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యం సిద్దిస్తుంది. ఉత్సాహంగా గడుపుతారు. బంధుత్వాలు, సంబంధాలు బలపడుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఒక సమాచారం ఆలోచింప జేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతరు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. నిర్మాణాలు, మరమ్మతులు వేగవంతమవుతాయి. వస్త్ర వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. దైవ దర్శనంలో ఇబ్బందులెదురవుతాయి.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
వ్యవహార దక్షతతో రాణిస్తారు. భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. గురు, శుక్ర వారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. అపరిచితులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ప్రియతముల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ దర్శనాలు సంతృప్తినిస్తాయి. బెట్టింగులు, జూదాలకు పాల్పడవద్దు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సకాలంలో చెల్లంపులు జరుపుతారు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆగ్రహావేశాలు ప్రదర్శించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఖర్చులు విపరీతం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. శని, ఆది వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. గృహ మార్పు కలిసివస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుత్వాలు బలపడుతాయి. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. పరిచయాలు బలపడుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. గుట్టుగా వ్యవహరించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మంగళ, బుధ వారాల్లో పనులు ఒత్తిడి, శ్రమ అధికం. బంధువుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. సంతాన విషయంలో శుభ ఫలితాలున్నాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర, 1, 2, 3 పాదాలు
లక్ష్య సాధనకు కృషి పట్టుదల ప్రధానం. స్వయంకృషితో రాణిస్తారు. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి. అర్థాంతంగా నిలిపి వేసిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. చెల్లింపులు నగదు స్వీకరణలో జాగ్రత్త. గురువారం నాడు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. సమన్వయంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. మీ శ్రీమతి సలహా పాటించండి. నోటీసులు అందుకుంటారు. ఉద్యోగస్తులు శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వేడుకలు వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థికస్థితి సామాన్యం, ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. మీ సమర్థత ఎదుటివారికి కలిసివస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. అవకాశాలను వదులుకోవద్దు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. ప్రలోభాలు ఒత్తిళ్లకు లొంగవద్దు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. ప్రముఖుల ఇంటర్య్వూలు అనుకూలించవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం.