సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Modified: శుక్రవారం, 2 అక్టోబరు 2020 (22:18 IST)

01-10-2020 నుంచి 31-10-2020 వరకు మీ రాశి ఫలితాలు

మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
అన్ని రంగాల వారికి కలిసివచ్చే సమయం. అంచనాలు ఫలిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. గృహంలో నూతన వాతావరణం నెలకొంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. సంతానం చదువులపై దృష్టి పెడతారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. వేడుకకు యత్నాలు సాగిస్తారు. బాధ్యతలు, పనులు స్వయంగా చూసుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు కొత్త బాధ్యతలు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.
 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఈ మాసం మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఆర్ధిక ఇబ్బందులు లేకున్నా సంతృప్తి ఉండదు. ఏదో సాధించలేక పోయామన్న వెలితి వెంటాడుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మానసికంగా కుదుటపడుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. విద్యార్థులకు ఒత్తిడి, శ్రమ అధికం. విలువైన వస్తువులు జాగ్రత్త. వాస్తుకు అనుగుణంగా గృహమార్పు చేపడుతారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరం. ఉద్యోగస్తులకు ధనయోగం. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. ప్రయాణంలో ఒకింత అవస్థలు తప్పవు.
 
మిథునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కార్యదీక్ష స్పూర్తిదాయకమవుతుంది. బంధుత్వాలు బలపడుతాయి. గృహంలో స్తబ్దత తొలగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కష్టమనుకున్న పని తేలికగా పూర్తవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. గృహమార్పు అనివార్యం. కార్మికులు, చేతివృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులకు అనుకూలం. దైవ దర్శనాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. వాహనం ఇతరులకివ్వద్దు.
 
కర్కాటకరాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. వాగ్ధాటితో రాణిస్తారు. పరిచయాలు విస్తరిస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. వ్యవహారాలు మీ చేతులు మీదుగా సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ధనలాభం ఉంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. సమస్యలు కొలిక్కి వస్తాయి. మానసికంగా కుదుటపడుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. గృహ మరమ్మతులు చేపడుతారు. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. మీ పథకాలు సత్పలితాలిస్తాయి. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. విద్యాసంస్థలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు.
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ సహనానికి పరీక్షా సమయం. ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ నిదించవద్దు. అవకాశాలు చేజారిపోతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధన సమస్యలు ఎదురవుతాయి. సాయం చేసేందుకు అయినవారే సందేహిస్తారు. అవసరాలు వాయిదా పడుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. సంతాన విషయంలో శుభ పరిణామాలున్నాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ద అవసరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్ద మొత్తం సరకు నిల్వ తగదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత. సమయ పాలన ప్రధానం. కార్మికులకు ఆశాజనకం. పందాలు, జూదాల జోలికి పోవద్దు.
 
కన్యారాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ మాసం ప్రథమార్థం ఏమంత అనుకూలం కాదు. శ్రమించినా ఫలితం అంతంతమాత్రమే. ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడుతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టిపెడతారు. అవసరాలు అతికష్టం మీద నెరవేరుతాయి. వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. సంతానం అత్యుత్సాహం సమస్యాత్మకమవుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు ఆశించినంత ఫలితమీయవు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడుతాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. కిట్టని వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. అంచనాలు ఫలిస్తాయి. ధనలాభం, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు విపరీతం డబ్బుకు ఇబ్బందులుండవు. ప్రణాళిక రూపొందించుకుంటారు. గృహం సందడిగా ఉంటుంది. వ్యాపకాలు అధికమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ప్రియతములకు వీడ్కోలు పలుకుతారు. ప్రయాణం కలిసివస్తుంది. బెట్టింగులకు పాల్పడవద్దు.
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
ఆదాయవ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంప్రదింపులకు అనుకూలం. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. గృహమార్పు చికాకు పరుస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశమివ్వద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
ధనుర్ రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
శుభ కార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. కార్యసాధనకు మరింత శ్రమించాలి. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. పెద్దల సలహా పాటించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ సహాయంతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
మకర రాశి: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారాలు మీ చేతులు మీదుగా సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. అన్ని విధాల కలిసివచ్చే కాలం. మాట నిలబెట్టుకుంటారు. గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. బంధు మిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. వాస్తుకు అనుగుణంగా గృహ మార్పు చేపడుతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆలయాలు సేవా సంస్థలకు సాయం అందిస్తారు. నగదు ఆభరణాలు జాగ్రత్త. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కార్మికులకు సదావకాశాలు లభిస్తాయి. ప్రయాణంలో ఇబ్బందులెదురవుతాయి.
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వస్త్రప్రాప్తి, వస్తు లాభం ఉన్నాయి. ఖర్చులు విపరీతం. కొంత మొత్తం ధనం అందుతుంది. చెల్లలింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ప్రేమానుబంధాలు బలపడుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పదవులు కోసం యత్నాలు సాగిస్తారు. పరిచయాలు ఉన్నతికి దోహదం చేస్తాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. కొత్త సమస్యలెదురవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా ఆలోచించవద్దు. ప్రియతముల రాక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. మీ పథకాలు మెరుగైన ఫలితాలిస్తాయి. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. న్యాయ, వైద్య రంగాలవారికి ఆదాయాభివృద్ధి. పందాలు, పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి.
 
మీన రాశి: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ మాసం మిశ్రమ ఫలితాల సమ్మేళనం. శ్రమించినా ఫలితం అంతంతమాత్రమే. అవకాశాలు చేజారిపోతాయి. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. సంతృప్తికరం. వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారులు ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. వాహనం ఇతరులకివ్వద్దు.