సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Modified: మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (10:17 IST)

01-09-2020 నుంచి 30-09-2020 వరకూ మీ మాస ఫలితాలు

మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక, 1వ పాదం
ప్రతికూలతలు ఎదురవుతాయి. ఆచితూచి వ్యవహరించాలి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలుతలెత్తుతాయి. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. అయిన వారు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. మీ తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ప్రతి చిన్న విషయానికి అసహనం చెందుతారు. ఏ పని చేపట్టినా మొదటికే వస్తుంది. గృహ మార్పు కలిసి వచ్చే ఆస్కారం ఉంది. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఈ చికాకులు తాత్కాలికమే త్వరలో పరిస్థితులు మెరుగుపడుతాయి. వ్యాపారాభివృద్దికి మరింత శ్రమించాలి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధ్యాపకులు పురస్కారాలు అందుకుంటారు. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర, 1, 2 పాదాలు
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. వాగ్వాదాలకు దిగవద్దు. సంప్రదింపులు వాయిదా పడుతాయి. ఆశావహ దృక్పథంతో మెలగండి. సహాయం ఆశించవద్దు. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. చెల్లింపు, నగదు స్వీకరణలో జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. సంస్థల స్థాపనకు తరుణం కాదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉపాధ్యాయులకు పురస్కార యోగం. ఉద్యోగస్తులకు ఒత్తిడి. శ్రమ అధికం, అధికారులకు వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సంతాన క్షేమం తెలుసుకుంటారు. ప్రయాణం అనుకూలించదు.
 
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పత్రాలు, నగదు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెట్టుబడుల వ్యవహారంలో పునరాలోచన అవసరం. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. పెద్ద మొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. విద్యా సంస్థలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. పందాలకు, జూదాలకు దూరంగా ఉండాలి.
 
కర్కాటకరాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ సలహా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమవుతుంది. వస్త్ర ప్రాప్తి, ధన లాభం ఉన్నాయి. రోజువారీ ఖర్చులే ఉన్నాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. పరిచయాలు బలపడుతాయి. సంస్థల స్థాపనకు తరుణం కాదు. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని పనులు అకస్మికంగా పూర్తవుతాయి. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం, ఉపాద్యాయులకు పదోన్నతి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం, దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం ఆనందదాయకం, వ్యవహారాలు అనుకూలిస్తాయి. వాగ్దాటితో నెట్టుకొస్తారు. బంధుత్వాలు బలపడుతాయి. గృహం సందడిగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఖర్చులు విపరీతం, ధనానికి ఇబ్బంది ఉండదు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రసీదులు జాగ్రత్త. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. అతిగా శ్రమించవద్దు. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పదవుల స్వీకరణకు అనుకూలం. బాధ్యతలు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు శుభయోగం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరకు నిల్వలో జాగ్రత్త. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ప్రయాణంలో స్వల్ప చికాకులెదుర్కొంటారు.
 
కన్యారాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులు సాగవు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. రుణాలు చేబదుళ్లు స్వీకరిస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా పడుతాయి. గృహ మార్పు అనివార్యం. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వద్దు. ప్రకటనలు, సందేశాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగొద్దు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కార్మికులు వృత్తుల వారికి నిరాశాజనకం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ, 1, 2, 3 పాదాలు
సమర్థత చాటుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. మీ జోక్యం అనివార్యం. సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నగదు, ఆభరణాలు జాగ్రత్త. వ్యాపకాలు అధికమవుతాయి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఉపాధ్యాయులకు పదవీయోగం. అధికారులకు ఒత్తిడి. పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వైద్య, న్యాయ, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ
అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. వ్యాపకాలు అదికమవుతాయి. స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసిచూడనట్టు వదిలి వేయండి. సంప్రదింపులకు అనుకూలం. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. సంతానం భవిష్యత్తులపై శ్రద్ద అవసరం. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు పనిభారం. విశ్రాంతి లోపం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కొంటారు. పెద్ద మొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. వేడుకలకు హాజరవుతారు.
 
ధనస్సు రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, 1వ పాదం
ఈ మాసం యోగదాయకమే. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. గృహ మార్పు కలిసి వస్తుమంది. బంధు మిత్రులు మీ ఔనత్యాన్ని గుర్తిస్తారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. సంతానం, ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. వ్యాపారాలలో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. కార్మికులకు పనులు లభిస్తాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
మకరం: ఉత్తరాషాడ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ మాసం ద్వితీయార్థం ఆశాజనకం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. నిలిపి వేసిన పనులు ఎట్టికేలకు పూర్తవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. కార్యసాధనలో జయం. ధన ప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు సామాన్యం. గృహంలో స్తబ్దత తొలగుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా సాగుతాయి. చెల్లింపులు నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. న్యాయ,సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. వ్యాపకాలు అధికమవుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. పత్రాలు అందుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ఆరోగ్యపరంగా సమస్యలెదుర్కొంటారు. ప్రియతముల రాక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు శుభ యోగం. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపా రాలే శ్రేయస్కరం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
మీనరాశి: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంధి ఉండదు. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ప్రియతముల ఆరోగ్యం మెరుగు పడుతుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. సభ్యత్యాలు, పదవులు స్వీకరిస్తారు. బాధ్యతగా వ్యవహరించాలి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించ వద్దు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అదికం. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆందోళన తగ్గి కుదుట పడుతారు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత. సమయపాలన ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కార్మికులు, చేతివృత్తుల వారికి ఆశాజనకం. సమావేశాలు, సన్మాన సభల్లో పాల్గొంటారు.